Aishwarya Lekshmi: నన్ను సింగిల్‌గా ఉండనివ్వరా..
ABN, Publish Date - Sep 29 , 2024 | 10:16 PM
ఇప్పటివరకు తాను ఎంతో సంతోషంగా, సింగిల్‌గా ఉంటున్నానని హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి వెల్లడించారు. అయితే, తాను సింగిల్‌గా, సంతోషంగా ఉండటం చాలా మందికి ఇష్టంలేనట్టుగా ఉందన్నారు. ఆమె ఎందుకిలా అన్నారో తెలుసుకోవాలంటే..
ఇప్పటివరకు తాను ఎంతో సంతోషంగా, సింగిల్‌గా ఉంటున్నానని హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) వెల్లడించారు. అయితే, తాను సింగిల్‌గా, సంతోషంగా ఉండటం చాలా మందికి ఇష్టంలేనట్టుగా ఉందన్నారు. మలయాళంలో ‘మాయనది’ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఐశ్వర్య లక్ష్మి... ఆ తర్వాత కోలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ‘గట్టాకుస్తీ’, ‘పొన్నియిన్ సెల్వన్’ ఘన విజయంతో తమిళం, తెలుగు, మలయాళ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇపుడు తమిళం, మలయాళం, తెలుగు చిత్రసీమల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా చిట్‌చాట్ నిర్వహించారు.
Also Read- Megha Akash Couple: రాహుల్ గాంధీని కలిసిన మేఘా ఆకాష్ దంపతులు
ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన అనేక ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. అయితే, ఒక వీరాభిమాని మాత్రం మీరు ఎపుడు డబుల్ అవుతారు (వివాహం చేసుకుంటారు) అంటూ ప్రశ్నించారు. దీనికి ఆమె సమాధానమిస్తూ, ‘‘ప్రస్తుతం నేను సింగిల్‌గా చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ, చాలా మంది పెళ్ళి ఎపుడు చేసుకుంటారంటూ పదేపదే ప్రశ్నిస్తున్నారు. నేను సింగిల్‌గా సంతోషంగా ఉండటం ఇష్టం లేదా?. దయచేసి నన్ను డబుల్ చేసేందుకు ప్రయత్నించవద్దు’’ అని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆమె కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఐశ్వర్య లక్ష్మి టాలీవుడ్ ప్రేక్షకులకు సైతం పరిచయం ఉన్న పేరే. ‘గాడ్సే’, ‘గార్గి’, ‘పొన్నియిన్ సెల్వన్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులలోనూ ఆమె గుర్తింపు పొందారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో సాయి దుర్గ తేజ్ నటిస్తోన్న పాన్ ఇండియా సినిమాలో ఆమె అవకాశం సొంతం చేసుకున్నారు. SDT18గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని ‘హనుమాన్’ మేకర్స్ నిర్మిస్తున్నారు. రీసెంట్‌గానే ఈ సినిమాకు సంబంధించిన ఐశ్వర్య లక్ష్మీ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ లుక్ బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే.