Prakash Raj: ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ మరోసారి పవన్ కళ్యాణ్‌కు కౌంటర్
ABN, Publish Date - Sep 25 , 2024 | 04:43 PM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు.. మరోసారి నటుడు ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. అంతకు ముందు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్ కళ్యాణ్ ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తానని చెప్పిన ప్రకాశ్ రాజ్.. తాజాగా కార్తీ విషయంలో పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయిన తీరుపై విమర్శిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏంటంటే..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan)కు.. మరోసారి నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) కౌంటర్ ఇచ్చారు. అంతకు ముందు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్ కళ్యాణ్ ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తానని మంగళవారం ప్రకాశ్ రాజ్ ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందే మరోసారి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ.. ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇంతకీ ప్రకాశ్ రాజ్ తన ట్వీట్లో ఏమన్నారంటే..
Also Read- Devara: వార్స్ వద్దు.. ‘దేవర’ అభిమానులకు నిర్మాత నాగవంశీ రిక్వెస్ట్
‘‘చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో.. జస్ట్ ఆస్కింగ్..’’ అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కి అర్థం.. మొన్న ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) సినిమా వేడుకలో కార్తీ (Hero Karthi( లడ్డూపై చేసిన కామెంట్స్‌కి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయిన తీరేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఆ వెంటనే కార్తీ రియాక్ట్ అవడం, సారీ చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా కార్తీ రియాక్ట్ అయిన తీరుపై అభినందించి.. ఆయన చిత్రానికి, ఆ చిత్ర టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత కార్తీ, సూర్య ఇద్దరూ పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ వ్యవహారం ఇంతటితో అయిపోయిందనుకుంటున్న సమయంలో.. ఇప్పుడు మళ్లీ ప్రకాశ్ రాజ్ ట్వీట్ రూపంలో కొత్త కాంట్రవర్సీకి శ్రీకారం చుట్టారు.
వాస్తవానికి కార్తీ ఆ సినిమా వేడుకలో మాట్లాడిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయిన తీరుపై నెట్టింట గట్టిగానే విమర్శలు వెల్లువెత్తాయి. అందులో కార్తీ ఏం తప్పుగా మాట్లాడలేదని, పవన్ కళ్యాణ్ ఒకసారి చూసి రియాక్ట్ అయితే బాగుండేదని.. కొంతమంది ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేశారు. అయినా విషయం పెద్దది అవడం ఇష్టం లేని కార్తీ.. తను సారీ చెప్పడమే కాకుండా.. తను కూడా వేంకటేశ్వరుని భక్తుడినే అని ట్వీట్లో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఆ జరిగిన సంఘటనలో కార్తీ ప్రమేయం లేదని చెబుతూ.. కానీ ఇలాంటి అంశాలపై మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలని సూచన చేశారు. అంతా కామ్ అయిన సమయంలో ప్రకాశ్ రాజ్ మళ్లీ ఇలా ట్వీట్ చేసి.. నెటిజన్లతో కామెంట్స్ చేయించుకుంటున్నారు. అవును ప్రకాశ్ రాజ్ చేసిన ఈ ట్వీట్‌కు నెటిజన్లు రకరకాల కామెంట్స్‌తో ప్రకాశ్ రాజ్‌ని విమర్శిస్తున్నారు.