Soniya Singh: నటి సోనియా సింగ్ ఆవిష్కరించిన సరోజ్ ఫ్యాబ్రిక్స్ స్టోర్
ABN, Publish Date - Apr 21 , 2024 | 11:34 PM
ముంబైలో పేరుగాంచిన సరోజ్ ఫ్యాబ్రిక్స్ హైదరాబాద్ నగరంలో అడుగు పెట్టింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11 లో ఏర్పాటుచేసిన ఈ స్టోర్‌ను శనివారం సినీనటి, ‘విరూపాక్ష’ ఫేమ్ సోనియా సింగ్ ప్రారంభించారు.
ముంబైలో పేరుగాంచిన సరోజ్ ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు హైదరాబాద్ నగరవాసులకు కూడా అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను శనివారం సినీ నటి, ‘విరూపాక్ష’ ఫేమ్ (Virupaksha Fame) సోనియా సింగ్ (Actress Soniya Singh) ప్రారంభించారు. 1976లో ‘సరోజ్ ఫ్యాబ్రిక్స్’ (Saroj Fabrics)లో ఫ్యాషన్ అభిమానులు రిటైల్ ప్రపంచంలోకి ప్రవేశించారు. ప్రారంభంలో హోల్‌సేల్ టెక్స్‌టైల్ వ్యాపారంగా స్థాపించబడి.. ఇప్పుడు భారీ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ బ్రాండ్‌గా రూపాంతరం చెందింది. ఇలాంటి చరిత్ర ఉన్న ఫ్యాబ్రిక్స్ స్టోర్‌ని ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది సోనియా సింగ్.
ఈ సందర్భంగా ఆమె (Soniya Singh) మాట్లాడుతూ.. ‘సరోజ్ ఫ్యాబ్రిక్స్’ ప్రారంభోత్సవంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం ఫాబ్రిక్ కాదు.., ఇది మీ వాలెట్లలో సులభంగా ఉండే విలాసవంతమైన డిజైనర్ ఫ్యాబ్రిక్ అని అన్నారు. అన్ని డిజైనర్ అవసరాలకు ఇది వన్-స్టాప్ సొల్యూషన్ అన్నారు. స్టైలింగ్ నుండి డిజైనర్ ఫ్యాబ్రిక్స్, అన్‌స్టిచ్డ్ సూట్‌లు, దుపట్టాల వరకు అన్నీ ఇక్కడ కవర్ చేయబడ్డాయని అన్నారు.
దక్షిణ భారతదేశంలో తన ఉనికిని విస్తరించిన ఈ ముంబై ఫేమస్ ఫాబ్రిక్ బ్రాండ్ (Mumbai Fabric Brand) సౌత్ ఇండియా మొత్తం తన డిజైనర్ మార్కెట్‌ను విస్తరించనుంది. సరోజ్ ఫ్యాబ్రిక్స్ దేశవ్యాప్తంగా వివిధ పెద్ద ఫ్యాషన్ హౌస్‌లు, సెలబ్రిటీల ఫ్యాషన్ డిజైనర్లు, రన్‌వే షోలు మరియు ప్రతిష్టాత్మకమైన ఫ్యాషన్ వీక్‌లకు ఒక సొల్యూషన్‌గా పేరుగాంచింది. ఈ సందర్భంగా సరోజ్ ఫ్యాబ్రిక్స్ డైరెక్టర్ అశోక్ మోడీ మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌కు అత్యుత్తమ ఫ్యాబ్రిక్స్ అనుభవాన్ని అందిస్తున్నందుకు సంతోషిస్తున్నామం. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ అతిపెద్ద ఫ్యాబ్రిక్స్ షోరూమ్ డిజైనర్లకు ఒక వరం అవుతుందని అన్నారు. పెళ్లి మరియు రోజువారీ ఫ్యాషన్ ఫ్యాబ్రిక్‌ల కోసం ఈ స్టోర్‌ను ప్రత్యేక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని, దాదాపు 50 సంవత్సరాల నైపుణ్యంతో, సరోజ్ ఫ్యాబ్రిక్స్ ప్రజలకు అవసరమైన అన్ని శుభకార్యాలతో పాటు, ఫ్యాషన్ డిజైనర్లు, సినిమాలు, సీరియల్స్, ఎగుమతిదారులు, బోటిక్ యజమానులు, ఫ్యాషన్ పరిశ్రమకు అత్యుత్తమ నాణ్యత గల బట్టలను సరఫరా చేయడం ద్వారా నమ్మకాన్ని సంపాదించుకుందని స్పష్టం చేశారు. ఫ్యాన్సీ సిల్క్‌ల నుండి క్లాసీ లినెన్‌ల వరకు, అందమైన ప్రింట్‌ల నుండి సున్నితమైన ఎంబ్రాయిడరీల వరకు, బంజారాహిల్స్ స్టోర్‌లో పెళ్లి దుస్తులు, రోజువారీ దుస్తులకు అవసరమైన అన్ని వస్త్రోత్పత్తులను అందుబాటులో ఉంచామన్నారు. వరుడుకే కాకుండా వారి కుటుంబ సభ్యులకు అవసరమైన దుస్తులు ధరించడం కోసం బ్రోకేడ్‌లు, సిల్క్స్, వెల్వెట్‌లు వంటి ఫ్యాబ్రిక్‌లను ఎంచుకోవడానికి పురుషులకు అవకాశం ఉందన్నారు.