Suman: ఏపీలో సినిమా ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే.. ఆ కండీషన్లు పెట్టకూడదు

ABN, Publish Date - Jul 19 , 2024 | 04:20 PM

ఫిలిం సిటీలా ఏపీలో చిన్నచిన్న సెట్స్ కట్టాలి.. అలాగే అవి రన్నింగ్ అవ్వడానికి కన్వెన్షన్ సెంటర్ అనుబంధంగా పెడితే ఆదాయానికిక కొదవ ఉండదని అన్నారు సీనియర్ నటుడు సుమన్. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఎన్నికల రిజల్ట్ తర్వాత అంతా బిజీగా ఉంటారని.. ఇప్పటి వరకు ఎవరినీ కలవలేదని ఆయన చెప్పుకొచ్చారు.

Actor Suman and Ministers Nara Lokesh and Anagani Satya Prasad

ఫిలిం సిటీలా ఏపీలో చిన్నచిన్న సెట్స్ కట్టాలి.. అలాగే అవి రన్నింగ్ అవ్వడానికి కన్వెన్షన్ సెంటర్ అనుబంధంగా పెడితే ఆదాయానికిక కొదవ ఉండదని అన్నారు సీనియర్ నటుడు సుమన్ (Actor Suman). తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్ (Nara Lokesh), అనగాని సత్యప్రసాద్‌‌లను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఎన్నికల రిజల్ట్ తర్వాత అంతా బిజీగా ఉంటారని ఇప్పటి వరకు ఎవరినీ కలవలేదని, ఒక ప్రోగ్రాం నిమిత్తం ఏపీ వచ్చిన తను.. కర్టసీగా అందరినీ కలుస్తున్నానని తెలిపారు.

Also Read- Pushpa 2: సహనానికి పరీక్షా? నిర్మాతల పాలిట శాపమా?   

మంత్రులు నారా లోకేష్ (Nara Lokesh), అనగాని సత్యప్రసాద్‌‌లను కలిసిన అనంతరం సుమన్ మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికల రిజల్ట్ తరువాత అందరూ బిజీగా ఉన్నారు. అందుకే ఇప్పటి వరకూ ఎవ్వరినీ కలువలేదు. శనివారం ఓ కార్యక్రమం ఉంది. అందుకే ఒక రోజు ముందు వచ్చి అందరినీ కర్టసీగా కలుస్తున్నాను. ఏపీలో అవకాశం కల్పించడం, స్టూడియోలు కట్టడం మాత్రమే కాదు.. ఈరోజుల్లో చిన్న సినిమాలు ఆడాలంటే లొకేషన్లు బాగుండాలి. పెద్ద సినిమాలు 20 శాతం మాత్రమే ఏపీలో చిత్రీకరణ జరిపి.. మిగిలిన పార్ట్ విదేశాలలోని లొకేషన్లలో తీస్తున్నారు. తమిళ, మలయాళ సినిమాల కథల్లో స్వేచ్ఛ ఉంటుంది. వారు ఎక్కడికైనా వెళ్లి సినిమాలు తీస్తారు. (Suman About Cinema Industry in AP)


గతంలో చెన్నైలోనే అన్ని సినిమాలు తీసేవాళ్లం. హైదరాబాద్‌ (Hyderabad)కు ఇండస్ట్రీ రావాలని, అక్కడే సినిమాలు తీయాలని.. 20 శాతం బయట తీయాలని అప్పట్లో రూల్ పెట్టారు. అక్కడున్న లొకేషన్లలో ఇప్పటికే చాలా సినిమాలు తీసేశాం. ప్రేక్షకులు కొత్త లొకేషన్లు ఉంటే తప్ప సినిమాలను ఆదరించడం లేదు. పెద్ద సినిమాలకు సెట్స్ వేయడానికి బడ్జెట్ ఉంటుంది. చిన్న సినిమాలకు అది సాధ్యం కాదు. కాబట్టి లొకేషన్ల విషయంలో కండిషన్లు వద్దు, చిన్న సినిమాలకు మరింత ఫ్రీడమ్ ఇవ్వాలి. గతంలో ఇక్కడే కాదు కాశ్మీర్‌లో సైతం సాంగ్స్ షూటింగ్ చేసేవాళ్లం. ఓటిటి జమానాలో సినిమాలు తీయాలంటే కథ బావుండాలి, లొకేషన్లలో కొత్తదనం ఉండాలి. తెలుగు సినిమాలు సక్సెస్ అయితే అవి కూడా డబ్బింగ్ అవుతాయి.

ఫిలిం సిటీలా ఏపిలో కూడా చిన్న చిన్న సెట్స్ కట్టాలి. అవి రన్నింగ్ అవడానికి కన్వెన్షన్ సెంటర్ అనుబంధంగా పెడితే ఆదాయానికిక కొదవ ఉండదు. ఏపీలో ఉన్న నిర్మాతలందరూ ఇక్కడే సినిమాలు తీద్దామనుకుంటున్నారు. హైదరాబాద్‌లో కాస్ట్ ఎక్కువ అవుతుందనే అభిప్రాయం వారికి ఉంది. ఒక మీటింగ్ పెట్టుకొని డిప్యూటీ సీఎం (Deputy CM), సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ (Cinematography Minister)లు చర్చించి సీఎం దగ్గరకు వెళ్లి మాట్లాడాలి. నిర్మాతలు కూడా ఇంట్రస్ట్‌గా ఉన్నారు కాబట్టి.. తెలంగాణతో పాటు ఏపీలోనూ సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవుతుందని చెప్పుకొచ్చారు.

Read Latest Cinema News

Updated Date - Jul 19 , 2024 | 05:14 PM