KA: ‘క’ సినిమాలో చూపించిన ఆ గ్రామం నిజంగానే ఉంది.. ఎక్కడో తెలుసా
ABN, Publish Date - Nov 05 , 2024 | 04:52 PM
రీసెంట్‌గా వచ్చిన కిరణ్ అబ్బవరం సినిమా ‘క’లో క్రిష్ణగిరి అనే ఊరుని చూపించి, ఆ ఊరికి ఒక విశిష్టత ఉండేలా చూపించారు. ఆ విశిష్టత ఏమిటంటే.. ఆ ఊరిలో మూడు గంటలకే చీకటి పడుతుంది. అంటే ఆ ఊరుకి సాయంత్రం అనేది తెలియదు. సేమ్ టు సేమ్ అలాంటి ఊరే తెలుగు రాష్ట్రంలో ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..
రీసెంట్‌గా వచ్చిన కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) సినిమా ‘క’ (KA Movie)లో క్రిష్ణగిరి అనే ఊరు, ఆ ఊరికి ఒక విశిష్టత ఉండేలా చూపించారు. ఆ విశిష్టత ఏమిటంటే.. ఆ ఊరిలో మూడు గంటలకే చీకటి పడుతుంది. అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అనే నాలుగు జాములలో ఆ ఊరిలో సాయంత్రం అనేది ఉండదు. మధ్యాహ్నం ముగిసిన వెంటనే అంటే సాయంత్రం 4 గంటలకే చీకటి పడుతుంది. అయితే ఇదేదో ఊహించి పెట్టినది అయితే కాదు.. ఎందుకంటే, సేమ్ టు సేమ్ ఇలాంటి గ్రామమే రియాలిటీలోనూ ఉంది. అదీ కూడా ఎక్కడో విదేశాల్లో కాదు.. తెలుగు ప్రజలు ఉండే తెలంగాణ రాష్ట్రంలోనే. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Nivetha Pethuraj: బాలుడి చేతిలో మోసపోయా
‘క’ సినిమాలో చూపించిన మూడుజాముల ఊరు నిజంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. పెద్దపల్లి దగ్గరలోని.. ‘మూడుజాముల కొదురుపాక’ గ్రామంలో సూర్యుడు కొండల వెనుకకు వెళ్లి, సాయంత్రం 4 గంటలకే చీకటి పడుతుందని తెలుపుతూ.. ఆ ఊరుకి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్దపల్లికి చెందిన సుల్తానాబాద్ మండలంలో ఉన్న కొదురుపాకను మూడు జాముల కొదురుపాక అంటారు. ఆ ఊరి వారికి నిజంగానే సాయంత్రం తెలియదట. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మాత్రమే వారికి తెలుసని, అందుకే ఆ ఊరికి మూడు జాముల కొదురుపాక అని పేరు పెట్టినట్లుగా చెబుతూ.. నెటిజన్లు కొందరు సాక్ష్యంగా వీడియోలను కూడా జత చేస్తున్నారు.
అయితే ఈ మూడుజాముల కొదురుపాక (Mudujamula Kodurupaka) విశిష్టత ఇంతకు ముందే కొన్ని పత్రికలలో వచ్చినా.. అంతగా జనాలకు తెలియలేదు. ఎప్పుడైతే ‘క’ సినిమాలో ఈ కాన్సెప్ట్‌ని హైలెట్ చేశారో.. ఇప్పుడీ ఊరి పేరు బాగా హైలెట్ అవుతోంది. అంతా ‘క’ పుణ్యమే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన ‘క’ (KA) సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మొదటి ఆట నుంచే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ స్పందనను రాబట్టుకుని.. హౌస్ ఫుల్ బోర్డులతో సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన ఈ విజయంతో కిరణ్ అబ్బవరం కూడా చాలా సంతోషంగా ఉన్నారు.