Joker: ప్రపంచమంతా వెయిటింగ్.. కొన్ని గంటల్లో జోకర్ వచ్చేస్తున్నాడు
ABN, Publish Date - Oct 01 , 2024 | 07:03 PM
సుమారు ఐదేండ్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులె వేయి కళ్లతో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. వరల్డ్ మోస్ట్ ఎవైటెడ్ ఫిలిం జోకర్ సినిమా మరి కొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
సుమారు ఐదేండ్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులె వేయి కళ్లతో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. వరల్డ్ మోస్ట్ ఎవైటెడ్ ఫిలిం జోకర్ (Joker: Folie à Deux) సినిమా మరి కొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఇప్పటికే చాలా దేశాలలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమవడమే కాక కొన్ని చోట్లా హౌజ్‌పుల్స్ కూడా పడిపోతున్నాయి. 2019లో వచ్చిన జోకర్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్ (Joker: Folie à Deux) చిత్రం రెండు రోజులు ముందుగానే మన దేశంలో విడుదల కానుంది. గత చిత్రాన్ని డైరెక్ట్ చేసిన టాడ్ ఫిలిప్స్ (Todd Phillips) ఈ సినిమాకు దర్శకత్వం వహించగా జోక్విన్ ఫీనిక్స్ (Joaquin Phoenix), లేడీ గాగా (Lady Gaga), బ్రెండన్ గ్లీసన్ (Brendan Gleeson), కేథరీన్ కీనర్ (Catherine Keener), జాజీ బీట్జ్ (Zazie Beetz) కీలక పాత్రల్లో నటించారు.
కథ విషయానికి వస్తే.. గోతం అనే సిటీలో జోకర్ (ఆర్థర్ ఫ్లెక్) అని పిలవబడే సాధారణ వ్యక్తి ప్రపంచంలోనే క్రూయల్ విలన్‌గా ఎలా మరాడనే కథగా ఈ సినిమా ఉంటుంది. మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకుని తన తల్లిని బాగా చూసుకోవాలనుకునిఆర్థర్ ఫ్లెక్ అనుకుంటుంటాడు. కానీ అతనిని ఎవరు దగ్గరకు తీయరు.. చుట్టూ సమాజం నుంచి వింత అనుభవాలు ఎదురవడంతో సైకలాజికల్‌గా డిస్ట్రబ్ అవుతాడు. తను ఎంతో అరాధించే కమెడియన్ కూడా ఓ సందర్భంలో హేళన చేయడంతో తట్టుకోలేక పబ్లిక్‌గా ఓ లైవ్ షోలో వేల మంది చూస్తుండగా కాల్చి చంపుతాడు. ఇక ఆ తర్వాత అతని లైఫ్ ఎన్ని రకాల ములుపులు తిరిగింది, అతనికి సపోర్ట్‌గా దేశమంతా మద్దతుదారులు ఎందుకు పెరుగుతూ వచ్చారనే ఆసక్తికరమైన కథకథనాలతో సినిమా సాగుతుంది.
ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ జోకర్ (Joker: Folie à Deux) మూవీలో.. వరుస హత్యల తర్వాత తను నివసించే సిటీలో మంచి సెలబ్రిటీగా గుర్తింపును తెచ్చుకున్న జోకర్ పోలీసుల పర్యవేక్షణలో ఉండడం, తనను ప్రేమిస్తున్న యువతి కోసం ఎదురు చూడడం, తనలో దాగి ఉన్న సంగీతాన్ని బయటపెట్టడం అనే అంశాల చుట్టూ సినిమా ఉండనుంది. కాగా అమెరికాలో విడుదలకు ముందే ఆక్టోబర్2న మన దేశపు థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇదిలాఉండగా ఈ సినిమా మొదటి భాగం జోకర్ కూడా 2019లో అక్టోబర్ 2వ తేదీనే విడుదల కావడం గమనార్హం.
రెండు నెలల క్రితమే విడుదలైన ఈ జోకర్ (Joker: Folie à Deux) సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. రీసెంట్‌గా సినిమా టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేయగా మన హైదరాబాద్‌లో కొన్ని మల్లిఫ్టెక్స్‌లు ఇప్పటికే హౌజ్‌ఫుల్ అవడం చూస్తుంటే ఈ సినిమా కోసం ప్రజలు ఏ రీతిన ఎదురు చూస్తున్నారో అర్థమవుతోంది. ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా దేశంలోని ప్రధాన నగరాలలోని ప్రస్తుతం ఇదే తరహా పరిస్థితి ఉంది. ఇంకా టికెట్లు దొరికాయంటూ తమ తమ సోషల్ మీడియాల్లో టికెట్ల స్క్రీన్ షాట్లు పెడుతూ తమ సంతోషాన్ని ఇతరులతో షేర్ చేసుకుంటున్నారు.