మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bad Boys: వరల్డ్ యాక్షన్ ఫీస్ట్.. ‘బ్యాడ్ బాయ్స్’ వ‌చ్చేస్తున్నారు! మీరు సిద్ధ‌మా

ABN, Publish Date - Jun 03 , 2024 | 11:25 AM

ప్ర‌పంచ‌వ్యాప్తంగా యాక్ష‌న్ ప్రియుల‌ను అల‌రించేందుకు ఈ వారం మ‌రో భారీ హాలీవుడ్ చిత్రం బ్యాడ్‌బాయ్స్ ముస్తాబైంది. విల్ స్మిత్ , మార్టిన్ లారెన్స్ హీరోలుగా న‌టించ‌గా బ్యాడ్‌బాయ్స్ సినిమాల సీక్వెల్‌లో ఇది నాలుగో చిత్రం

Bad Boys

ప్ర‌పంచ‌వ్యాప్తంగా యాక్ష‌న్ ప్రియుల‌ను అల‌రించేందుకు ఈ వారం మ‌రో భారీ హాలీవుడ్ చిత్రం బ్యాడ్‌బాయ్స్ రైడ్ ఆర్ డై (Bad Boys: Ride or Die) ముస్తాబైంది. ప్ర‌ఖ్యాత న‌టుడు విల్ స్మిత్ (Will Smith), మార్టిన్ లారెన్స్ (Martin Lawrence) హీరోలుగా న‌టించ‌గా జర్నీ 2 సినిమాతో ఫేమ్ వెనేషా హ‌డ్గ‌న్స్ (Vanessa Hudgens) క‌థానాయిక‌గా న‌టించింది. బ్యాడ్‌బాయ్స్ సినిమాల సీక్వెల్‌లో ఇది నాలుగో చిత్రం కాగా ఇంద‌కు మునుపు వ‌చ్చిన బ్యాడ్ బాయ్స్ Bad Boys (1995) , బ్యాడ్ బాయ్స్ 2 (2003) Bad Boys II , బ్యాడ్ బాయ్స్ ఫ‌ర్ లైఫ్ (2020) Bad Boys for Life చిత్రాలు అదిరిపోయే యాక్ష‌న్ న్నివేశాల‌తో ఆక‌ట్టుకున్నాయి. ఇప్పుడు మ‌ళ్లీ నాలుగు సంవ‌త్స‌రాల త‌ర్వాత అంత‌కుమించి అనేలా సీన్ల‌తో మ‌రింత రంజుగా ఈ బ్యాడ్‌బాయ్స్ రైడ్ ఆర్ డై (Bad Boys: Ride or Die) ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

ఈ సీక్వెల్స్‌లో గ‌తంలో వ‌చ్చిన సినిమాలు ఒక దాన్ని మించి మ‌రోటి క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించ‌డంతో ఇప్పుడు అందిరి దృష్టి ఈ చిత్రంపై ప‌డింది. వాటి రికార్డుల‌ను ఇది అధిగ‌మిస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. క‌థ విష‌యానికి వ‌స్తే.. అంత‌కుముందు జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌లో డిటెక్టివ్‌లు లెఫ్టినెంట్ మైఖేల్ యూజీన్ "మైక్" లోరీ (Michael Eugene "Mike" Lowrey), లెఫ్టినెంట్ మార్కస్ మైల్స్ బర్నెట్ (Detective Lieutenant Marcus Miles Burnett) ల‌ కెప్టెన్ హోవార్డ్ మ‌ర‌ణిస్తాడు. అంతేగాక పోలీసుల ఎంక్వైరీలో వీరు రొమెనీయా మాఫియాతో సంబంధాలు ఉన్నాయ‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తాయి. దీంతో పోలీసులు వీరి కోసం గాలింపు తీవ్ర‌త‌రం చేయ‌డంతో డిటెక్టివ్స్‌ ఇద్ద‌రు పోలీసుల తెలియ‌కుండా అ కేసును చేధించే ప‌నిలో ప‌డ‌తారు.


ఈ క్ర‌మంలో వారు అస‌లు నిందితుల‌ను గుర్తించి మ‌ట్టుబెట్టారా, వారు కేసులో ఎలా ఇరుక్కున్నారు, లా అండ్ అర్డ‌ర్‌ను చేతిలోకి తీసుకుని శ‌త్రువులపై ఎలా పోరాటం చేశార‌నే అనే క‌థ‌నంతో ఫుల్ లెంగ్త్ ఫైటింగ్‌ సీన్స్‌, కామెడీతో సినిమాను తెర‌కెక్కించారు. ట్రైల‌ర్ చూస్తే యాక్ష‌న్ దృశ్యాలు ఏ రేంజ్‌తో తీశారో అర్ధ‌మ‌వుతుంది. ఇప్పుడీ సినిమా జూన్ 6న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. ఇంగ్లీష్ తో పాటు అన్ని సౌత్ ఇండియ‌న్ లాంగ్వేజెస్‌లో సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. సో యాక్ష‌న్ ల‌వ‌ర్స్ వీకెండ్ డోంట్ మిస్ ది బ్యాడ్‌బాయ్స్ రైడ్ ఆర్ డై (Bad Boys: Ride or Die) మూవీ ఇన్ థియేట‌ర్స్‌.

Updated Date - Jun 03 , 2024 | 11:25 AM