Furiosa: A Mad Max Saga: ప్రపంచమంతా పిచ్చిగా ఎదురుచూస్తున్న సినిమా.. ఇంకొన్ని గంటల్లో
ABN, Publish Date - May 22 , 2024 | 05:32 PM
విశ్వవ్యాప్తంగా సినీ లవర్స్‌ను అలరించేందుకు మరో భారీ హాలీవుడ్ చిత్రం రెడీ అవుతోంది. ప్రస్తుతం ప్రపంచమంతా పిచ్చిగా ఎదురుచూస్తున్న ఫ్యూరోసియా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్‌కు రెడీ అయింది.
విశ్వవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్‌ను అలరించేందుకు మరో భారీ హాలీవుడ్ చిత్రం రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సంవత్సరం గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ (Godzilla x Kong: The New Empire), కింగ్‌డమ్ ఆఫ్ ది ఫ్లానెట్ ఆఫ్ ది ఏప్స్ (Kingdom of the Planet of the Apes) వంటి బడా సినిమాలు విడుదలై భారీ వసూళ్లు సాధించి ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించగా తాజాగా వీటన్నింటిని తలదన్నేలా రూపొందిన ఫ్యూరోసియా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా (Furiosa: A Mad Max Saga) సినిమా థియేటర్లలో రిలీజ్‌కు రెడీ అయింది. రేపు (మే 23) గురువారం రోజున ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే డిస్టోపియన్ యాక్షన్ జానర్‌లో వస్తున్న ఈ సిరీస్ సినిమాలకు అన్ని దేశాలలో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉండడంతో ఈ సినిమా వసూళ్ల సునామీ ఓ రేంజ్‌లో ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.
2015లో వచ్చిన మ్యాడ్‌మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ (Mad Max: Fury Road ) చిత్రానికి ఫ్రీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం ట్రైలర్లు ఇప్పటికే విడుదలై మంచి బజ్‌ను క్రియేట్ చేయడంతో సర్వత్రా సినీ అభిమానులు ముఖ్యంగా మ్యాడ్‌మ్యాక్స్ సిరీస్ అభిమానులు ఈ సినిమా విడుదల కోసం వెయ్యె కండ్లతో ఎదురు చూస్తున్నారు. థోర్, ఎక్స్ ట్రాక్షన్ వంటి భారీ సినిమాలతో టాప్ హాలీవుడ్ సట్ఆర్గా పేరు తెచ్చుకున్న క్రిస్ హెమ్స్‌వర్త్ (Chris Hemsworth) హీరోగా, ఆన్య టేలర్ జాయ్ (Anya Taylor-Joy), ఛార్లస్ థెరాన్ (Charlize Theron) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అదేవిధంగా గత చిత్రాలను డైరెక్ట్ చేసిన అస్ట్రేలియన్ రచయిత, నిర్మాత జార్జ్ మిల్లర్ (George Miller) ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు.
ఫస్ట్ టైం 1979లో మ్యాడ్ మ్యాక్స్ పేరుతో స్టార్ట్ అయిన ఈసినిమాల పరంపర నేటికీ కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ప్రపంచమంతా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రస్తుతం రాబోతున్న ఫ్యూరోసియా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా (Furiosa: A Mad Max Saga) ఈ సిరీస్‌లో 6వ చిత్రం కావడం విశేషం. ఇదిలాఉండగా ఈ చిత్రానికి సీక్వెల్ మ్యాడ్ మ్యాక్స్ (ది వేస్ట్ ల్యాండ్) Mad Max: The Wasteland త్వరలో పట్టాలెక్కనుండగా 2026లో విడుదల కానుంది. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందకు వస్తున్న ఫ్యూరోసియా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా (Furiosa: A Mad Max Saga) కథ విషయానికి వస్తే..
ప్యూరీ రోడ్ సినిమాలో వచ్చిన ఫ్యూరియోసా (ఛార్లెస్ థెరాన్) Charlize Theron అనే క్యారెక్టర్ ఈ మ్యాడ్‌మ్యాక్స్ సిరీస్‌లోకి ఎలా వచ్చింది, అప్పటివరకు కింగ్ రక్షకురాలిగా ఉన్న ఆమె కింగ్‌ను ఎదిరించి ఆయన ఐదుగురు భార్యలను ఎందుకు రక్షించిందనే ఇంట్రెస్టింగ్ కథకథనాలతో సినిమా ఉండనుంది. ఈక్రమంలో అంతకుముందు చిత్రాలను మించిన యాక్షన్, అడ్వెంచర్ సన్నివేశాలు, అదిరిపోయే విజువల్స్‌తో ప్రేక్షకులు విజిల్స్ వేసేలా థ్రిల్‌ను ఇచ్చేలా సినిమాను రూపొందించారు. సో యాక్షన్ ప్రియులు ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయకండి.