మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

OTT: అదిరిపోయే హాలీవుడ్ సిరీస్ ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఓటీటీలోకి ఎప్పుడంటే!

ABN, Publish Date - May 14 , 2024 | 09:48 PM

ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి మ‌రో హాలీవుడ్ సిరీస్ రెడీ అయింది. 2022 సెప్టెంబ‌ర్‌లో వ‌చ్చిన ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ సిరీస్‌కు కొన‌సాగింపుగా రూపొందిన‌ రెండో సీజ‌న్ అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది.

ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి మ‌రో హాలీవుడ్ సిరీస్ రెడీ అయింది. 2022 సెప్టెంబ‌ర్‌లో వ‌చ్చిన ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ (The Lord of the Rings: The Rings of Power) సిరీస్‌కు కొన‌సాగింపుగా రూపొందిన‌ రెండో సీజ‌న్ అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది.

ఈ క్ర‌మంలో తాజాగా ఈ రోజు (మంగ‌ళ‌వారం) ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌గా మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంటోంది. మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కు మంత్రాలు, మాయ‌లు, కుట్ర‌లు, యుద్దాల నేప‌థ్యంలోనే ఈ సిరీస్ సాగుతూ చూసే ప్రేక్ష‌కుల‌కు మంచి అనుభూతిని అందిస్తుంది.


ఈ సీరీస్‌లో వ‌చ్చిన‌ మొదటి సీజన్ ప్రైమ్ వీడియోలో స్టీమింగ్ అవ‌గా ఎవ‌రూ ఊహించని విధంగా కొద్ది రోజుల్లోనే ప్రపంచమంతటా 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి కొత్త రికార్డుల‌ను తిర‌గ‌రాసింది.

అయితే ఇప్పుడు రానున్న రెండో సీజ‌న్ ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ (The Lord of the Rings: The Rings of Power) ను ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 29న‌ 240లకు పైగా దేశాలలో స్ట్రీమింగ్ చేయ‌నున్నారు. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషలలో అందుబాటులో ఉండ‌నుంది.

Updated Date - May 14 , 2024 | 09:51 PM