కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఓటీటీలో దూసుకెళుతున్న‌.. కంట‌త‌డి పెట్టించే స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్! డోంట్ మిస్‌

ABN, Publish Date - Jan 07 , 2024 | 04:26 PM

చాలా రోజుల త‌ర్వాత ఓ మంచి డ‌బ్బింగ్ చిత్రం సోసైటీ ఆప్ ది స్నో డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో వ‌చ్చిన ఈ సినిమా మ‌న‌కు కంట‌త‌డి తెప్పించడం ఖాయం.

society of the snow

చాలా రోజుల త‌ర్వాత ఓ మంచి డ‌బ్బింగ్ చిత్రం సోసైటీ ఆప్ ది స్నో (Society of the Snow) డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. చూసినవాళ్ల‌కు చాలా కాలం మ‌దిలో నిలిచే సినిమాగా ఇది నిల‌వ‌డం ఖాయం. స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో స్పానిష్ లాంగ్వేజ్‌లో వ‌చ్చిన ఈ చిత్రానికి ది ఇంఫాజిబుల్ (The Impossible), జురాసిక్ వ‌ర‌ల్డ్ (Jurassic World: Fallen Kingdom) వంటి భారీ హాలీవుడ్ స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను రూపొందించిన బయోనా (J. A. Bayona) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నిజ జీవితంలో జ‌రిగిన‌ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కు మ‌న‌ల్ని క‌ట్టి ప‌డేస్తుంది. త‌ర్వాత‌ ఏం జ‌రుగ‌బోతుంద‌నే ఉత్కంఠ‌ను, కంట‌త‌డి తెప్పించడం ఖాయం.

ఇక క‌థ విష‌యానికి వ‌స్తే.. 1972లో 45 మంది ర‌గ్బీ ఆట‌గాళ్ల‌తో వెళుతున్న ఓ ఉరుగ్వే విమానం ప్ర‌పంచంలోనే అతి పొడ‌వైన అండీస్ ప‌ర్వ‌తాల మ‌ధ్య‌లో కూలిపోయింది. అనంత‌రం ప్ర‌పంచంతో సంబంధాలు క‌ట్ అవ‌డ‌మే కాకుండా, విమానం క్రాష్ అయిన ప్ర‌దేశాన్ని రెస్క్యూ టీంలు గుర్తించ‌లేక పోతాయి. ఈ క్ర‌మంలో ఆ ప‌ర్వ‌తాల‌లో తీవ్ర మంచు తుఫానులు సంభ‌వించ‌డం, మ‌నుషులు గ‌డ్డ‌ క‌ట్టుకుపోయే చ‌లిలో వారు ఎక్క‌డ త‌ల‌దాచుకున్నారు, ఏం తిన్నారు, తాగారు, ఎంత‌మంది బ‌తికారు అనే అంశాలు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంటాయి. ఈ ప్ర‌మాదం నుంచి 72 రోజుల త‌ర్వాత‌ వారు ఎలా, ఎంత మంది బ‌య‌ట‌ప‌డ్డార‌నే ఇతివృత్తంలో తెర‌కెక్కించారు. ముఖ్యంగా తిండి కోసం అక్క‌డ వారు తీసుకున్న నిర్ణ‌యం మ‌న‌ ఓళ్లు జ‌ల‌ద‌రించేలా చేస్తుంది.


స్పెయిన్‌కు చెందిన‌ ద‌ర్శ‌కుడు బ‌యోనా 2012లో ది ఇంఫాజిబుల్ అనే ఓ డిజాస్ట‌ర్ డ్రామా అనే సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న స‌మ‌యంలో త‌న దృష్లికి వ‌చ్చిన వియ‌ర్సీ అనే పుస్త‌కాన్ని గురించి తెలుసుకుని దాని హ‌క్కుల‌ను కొనుగోలు చేశారు. అనంత‌రం ఈ క‌థ‌తో సినిమా తీసేందుకు ఉప‌క్ర‌మించారు. ఈ క్ర‌మంలో అప్ప‌టి ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డ, మ‌ర‌ణించిన కుటుంబ స‌భ్య‌లను ఇంట‌ర్వ్యూ చేసి దాదాపు 100 గంట‌ల స‌మాచారాన్ని రికార్డు చేశారు. ఈ త‌ర్వాత‌ 2021లో సినిమాని ప్రారంభించి 2022 జూలైలో ముగించారు. సినిమా చాలా వ‌ర‌కు సెట్‌లోనే తీసిన‌ప్ప‌టికీ కొంత‌మంది ఒరిజిన‌ల్‌గా ప్ర‌మాదం జ‌రిగిన ప్ర‌దేశానికి వెళ్లి మ‌రీ కొన్ని వీడియోలు చిత్రీక‌రించుకు వ‌చ్చి సినిమాలో వాడడం గ‌మ‌నార్హం.

దాదాపు 65 మిలియ‌న్ల వ్య‌యంతో నిర్మించ‌బ‌డ్డ‌ ఈ సినిమా 2023 డిసెంబ‌ర్‌లో విడుద‌లవ‌గా మంచి రెస్పాన్స్ రావ‌డ‌మే గాక విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోవ‌డ‌మే గాక‌ 60 వ‌ర‌కు జాతీయ‌, అంత‌ర్జాతీయ సినిమా ఫెస్టివ‌ల్స్‌కు సెల‌క్ట్ అవ‌డం విశేషం. ముఖ్యంగా 2024 96వ అస్కార్స్ అవార్డ్స్‌ల్లో మూడు విభాగాల్లో సెల‌క్ట్ అవ‌డ‌మే కాక టాప్ 15 సినిమాల షార్ట్ లిస్టులో చేరింది. ఆవార్డు త‌ప్ప‌నిస‌రిగా వ‌స్తుంద‌నే పేరు కూడా సంపాదించింది. ఇప్పుడు ఈ సినిమా జ‌న‌వ‌రి 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న‌ది. 2 గంట‌ల 15 నిమిషాల‌ ఈ చిత్రం తెలుగులోను అందుబాటులో కూడా ఉన్న‌ది. సినీమా అభిమానులు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ‌కుండా కుటుంబంతో క‌లిసి చూసేయండి. ఇదే కాన్సెస్ట్‌తో 90ల‌లో అలైవ్ అనే సినిమా కూడా వ‌చ్చింది.

Updated Date - Jan 07 , 2024 | 04:26 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!