Spider Man: యాహూ.. స్పైడర్ మాన్ వచ్చేస్తున్నాడు
ABN, Publish Date - Oct 24 , 2024 | 05:12 PM
స్పైడర్ మాన్: హోమ్ కమింగ్, స్పైడర్ మాన్: ఫార్ ఫ్రమ్ హోమ్, స్పైడర్ మాన్: నో వే హోమ్ చిత్రాలతో ప్రత్యేకమైన సీక్వెల్ సిరీస్ రూపొందించారు. అయితే స్పైడర్ మాన్: నో వే హోమ్ సినిమాతో ఈ సిరీస్ ముగిసిందని టాక్ వినిపించింది. దీంతో ఈ ఫ్రాంచైజీ అభిమానులు ఎంతో దిగులు చెందారు. తాజాగా ఈ మూవీ స్టార్ ఒక బంపర్ న్యూస్ తెలపడంతో ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. ఇంతకీ ఏమైందంటే..
ప్రపంచ ప్రఖ్యాత మార్వెల్ స్టూడియోస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మార్వెల్ యూనివర్స్‌లో మరింత ప్రత్యేకమైన కామిక్ స్పైడర్ మాన్. టామ్ హాలండ్ ప్రధాన పాత్రల్లో పోషించిన ఈ సినిమా ఇప్పటికే స్పైడర్ మాన్: హోమ్ కమింగ్, స్పైడర్ మాన్: ఫార్ ఫ్రమ్ హోమ్, స్పైడర్ మాన్: నో వే హోమ్ చిత్రాలతో ప్రత్యేకమైన సీక్వెల్ సిరీస్ రూపొందించారు. అయితే స్పైడర్ మాన్: నో వే హోమ్ సినిమాతో ఈ సిరీస్ ముగిసిందని టాక్ వినిపించింది. దీంతో ఈ ఫ్రాంచైజీ అభిమానులు ఎంతో దిగులు చెందారు. తాజాగా ఈ మూవీ స్టార్ ఒక బంపర్ న్యూస్ తెలపడంతో ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. ఇంతకీ ఏమైందంటే..
స్పైడర్ మాన్.. ప్రపంచంలో వయసుకు సంబంధం లేకుండా ఎక్కువ మంది అడిక్ట్ అయినా కామిక్. దీని ఆధారంగా నిర్మించిన స్పైడర్ మాన్: హోమ్ కమింగ్, స్పైడర్ మాన్: ఫార్ ఫ్రమ్ హోమ్, స్పైడర్ మాన్: నో వే హోమ్ సినిమాలు మరో ఎత్తు. 2021లో నో వే హోమ్ సినిమా రిలీజైన తర్వాత నెక్స్ట్ ఎలాంటి అప్డేట్ రాలేదు. మార్వెల్ కూడా ఇన్ని ఏళ్ళు మౌనంగా ఉండటంతో ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారు. కానీ.. ఈ మూవీ మెయిన్ లీడ్ టామ్ హాలండ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2025 సమ్మర్ లో నెక్స్ట్ పార్ట్ షూటింగ్ ప్రారంభం కానుంది అని ప్రకటించాడు. దీంతో స్పైడీ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. ప్రస్తుతం టామ్.. క్రిస్టోఫర్ నోలన్ పీరియాడికల్ వాంపైర్ మూవీలో మెయిన్ లీడ్ నటించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.