Emmy Awards: శోభితకు నిరాశే ఎదురైంది

ABN, Publish Date - Nov 26 , 2024 | 01:37 PM

శోభిత ధూళిపాళ్ల  నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ది నైట్‌ మేనేజర్‌’ ఉత్తమ వెబ్‌ సిరీస్‌ విభాగంలో పోటీపడిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌కి అవార్డు వస్తుందని అంతా భావించారు.

సినిమా ప్రతిష్టాత్మకంగా భావించే ఎమ్మీ అవార్డుల (Emmy Awards) వేడుక న్యూయార్క్‌లో ఘనంగా జరిగింది. ఈ అవార్డు వేడుకలో బాలీవుడ్‌ హాస్యనటుడు వీర్‌ దాస్‌ (Vir das) దీనికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ అవార్డుల్లో శోభిత ధూళిపాళ్ల (Sobitha Dhulipala)  నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ది నైట్‌ మేనేజర్‌’ (The night Manager) ఉత్తమ వెబ్‌ సిరీస్‌ విభాగంలో పోటీపడిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌కి అవార్డు వస్తుందని అంతా భావించారు. అయితే వారికి నిరాశే ఎదురైంది.

ఉత్తమ వెబ్‌ సిరీస్‌గా ఫ్రెంచ్‌ సిరీస్‌ ‘లెస్‌ గౌట్టెస్‌ డి డైయూ’ అవార్డును గెలుచుకుంది. ఈ వేడుక చివర్లో వీర్‌దాస్‌ మాట్లాడుతూ.. ‘నేను మీ అందరినీ అలరించానని ఆశిస్తున్నా. ఇంత గొప్ప వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ వేడుకలో హోస్ట్‌గా చేయడానికి ఎప్పుడైనా సిద్థంగానే ఉంటాను. అవార్డులు గెలుచుకున్న వారందరికీ అభినందనలు. ప్రేక్షకుల  ఆదరాభిమానాలు అన్ని అవార్డుల కంటే గొప్పవి’ అని అన్నారు.

ఎమ్మీ అవారుల విజేతలు వివరాలు..

ఉత్తమ సిరీస్‌ - లెస్‌ గౌట్టెస్‌ డి డైయూ
ఉత్తమ నటుడు - తిమోతీ స్పాల్‌
ఉత్తమ కామెడీ సిరీస్‌ - డివిజన్‌ పలెర్మో
ఉత్తమ టీవీ చిత్రం - లైబ్స్‌ కేౖండ్‌
ఉత్తమ యానిమేటెడ్‌ సిరీస్‌ -టాబీ మెక్‌టాట్‌

Updated Date - Nov 26 , 2024 | 01:54 PM