మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Priyanka Chopra: ఆ ఇంటి మరమ్మతులకే 2.5 మిలియన్ల డాలర్లు! 

ABN, Publish Date - Feb 01 , 2024 | 06:00 PM

గ్లోబల్‌స్టార్‌ ప్రియాంకా చోప్రా అమెరికన్  పాప్‌ సింగ్‌ర్‌ నిక్‌ జోనస్‌ను పెళ్లాడి అమెరికాలోనే స్థిరపడిన సంగతి తెలిసిందే! ఇద్దరూ తమ అభిరుచులకు తగ్గట్టు లాస్‌ ఏంజిలెస్‌లో 20 మిలియన్‌ డాలర్లతో విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారు.

గ్లోబల్‌స్టార్‌ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) అమెరికన్  పాప్‌ సింగ్‌ర్‌ నిక్‌ జోనస్‌ను (Nickjonas) పెళ్లాడి అమెరికాలోనే స్థిరపడిన సంగతి తెలిసిందే! ఇద్దరూ తమ అభిరుచులకు తగ్గట్టు లాస్‌ ఏంజిలెస్‌లో 20 మిలియన్‌ డాలర్లతో విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారు. ఆ ఫొటోలను గతంలో ఆ ఫొటోలను కూడా షేర్‌ చేశారు. తాజా సమాచారం ప్రకారం.. ఆ ఇంటి నుంచి వాళ్లిద్దరూ బయటకు వచ్చేశారు. ప్రస్తుతం ఈ వార్త హాలీవుడ్‌ మీడియా, సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ భవంతిలో చాలా ప్రదేశాల్లో డ్యామేజ్‌ ఉండడం, నీళ్లు లీక్‌ అవుతుండటంతో  దీనికి నష్టపరిహారం ఇప్పించాలని ఆ ఇల్లు  అమ్మిన వ్యక్తిపై కోర్టులో దావా వేశారు అని టాక్‌ నడుస్తోంది. ఈ కారణంతోనే ఆ  ఇంటి నుంచి బయటకు కూడా వచ్చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం ఆ ఇంటి విలువ సుమారు రూ.165 కోట్లు. ఆ ఇంటికి ఉన్న సమస్యలను మరమ్మతులు చేయించడానికి దాదాపు 2.5 మిలియన్‌ డాలర్లు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. 

ప్రియాంక, నిక్‌ ఎంతో ముచ్చటపడి కొనుగోలు చేసిన ఆ భవంతిలో విశాలమైన ఏడు పడక గదులు, తొమ్మిది బాత్‌రూమ్‌లు, టెంపరేచర్‌ కంట్రోల్డ్‌ వైన్‌ సెల్లార్‌, చెఫ్‌ కిచెన్‌, హోమ్‌ థియేటర్‌, స్పా, స్టీమ్‌ షవర్‌, జిమ్‌, బిలియర్డ్స్‌ రూమ్‌ లాంటివి ఉన్నాయి. పిల్లలతో గడిపే ప్రతి క్షణం గొప్పగా ఉండాలని ప్రియాంక - నిక్‌ ఆ ఇంటిని కొనుగోలు చేశారు. తమ ఆలోచనలకు అనుగుణంగా ఇంటీరియర్‌ చేయించుకున్నారు. అవుట్‌డోర్‌  విశాలంగా, గీనరీగా ఉండేలా తయారు చేసుకున్నారు. 


Updated Date - Feb 01 , 2024 | 06:42 PM