Oscars Ott: అస్కార్స్ సాధించిన సినిమాలు.. ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?
ABN, Publish Date - Mar 11 , 2024 | 07:07 PM
చాలామంది ఔత్సాహికులు అస్కార్ అవార్డులు దక్కించుకున్న చిత్రాలు ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. గూగుల్ సెర్చ్‌లో తాము చూడాలనుకుంటున్న సినిమాల గురించి సెర్చ్ చేస్తున్నారు. అలాంటి వారి కోసమే వివరాలు అందిస్తున్నాం
తాజాగా ఈ రోజు సోమవారం (మార్చి11)న అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్‌లో అస్కార్ అవార్డుల వేడుక చాలా అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో అందరు ఉహించినట్టుగానే ఓపెన్‌హైమర్ (oppenheimer) 7 అవార్డులు సాధించింది. వీటితో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ నామినేషన్లు దక్కించుకున్న చిత్రాలు కొన్ని విభాగాల్లో అవార్డులు సాధించాయి. అయితే చాలామంది ఔత్సాహికులు అస్కార్ అవార్డులు దక్కించుకున్న చిత్రాలు ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. గూగుల్ సెర్చ్‌లో తాము చూడాలనుకుంటున్న సినిమాల గురించి సెర్చ్ చేస్తున్నారు. అలాంటి వారి కోసమే అవార్డులు గెలుచుకున్న చిత్రాలు అవి స్ట్రీమింగ్ అవుతున్న ఫ్లాట్ ఫాంల గురించి వివరాలు అందిస్తున్నాం. మీరు వెతుకుతున్న సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడే తెలుసుకుని చూసేయండి.
ఈ అస్కార్ అవార్డ్స్‌లలో ఉత్తమ చిత్రం,ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు సహా మొత్తం 7 అవార్డులను దక్కించుకునొ ప్రధమ స్థానంలో నిలిచిన చిత్రం ఓపెన్‌హైమర్ (oppenheimer). ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, జియో సినిమా, బుక్ మైషో స్ట్రీం ఓటీటీల్లో రెంట్ పద్దతిలో ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. మార్చి 21 నుంచి జియో సినిమాలో ఫ్రీ గా చూడవచ్చు.
ఇక ఓపెన్‌హైమర్ తర్వాత అధికంగా 3 అవార్డులు సాధించిన పూర్ థింగ్స్ (Poor Things) అనే బ్లాక్ కామెడీ జానర్‌లో రూపొందిన చిత్రం ఉత్తమ కాస్టూమ్ డిజైన్: హోలి వెడ్డింగ్‌టన్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: జేమ్స్ ప్రైస్, షోనా హెత్, బెస్ట్ హెయిర్ స్టయిల్ అండ్ మేకప్: నడియా స్టేసీ, మార్క్ కౌలియర్ విభాగాల్లో అవార్డులు సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రం డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోండగా, యూ ట్యూబ్‌లో రెంట్ పద్దతిలో అందుబాటులో ఉంది.
ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్) అవార్డు దక్కించుకున్న ది లాస్ట్ రిపేర్ షాప్ (The Last Repair Shop) ప్రస్తుతం డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్‌లో, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డు దక్కించుకున్న ’వాట్ వాస్ ఐ మేడ్ ఫర్’ బార్బీ (Barbie) జియో సినిమాలో, లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ అవార్డు సాధఇంచిన ది వండర్‌ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ సుగర్ (The Wonderful Story of Henry Sugar) నెట్‌ఫ్లిక్స్ లో, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అవార్డు దక్కించుకున్న కార్డ్ జెఫర్‌పన్ అమెరికన్ ఫిక్షన్ (American Fiction) చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది.ఉత్తమ సహాయ నటి విభాగంలో అవార్డు దక్కించుకున్న అమెరికన్ కామెడీ డ్రామా చిత్రం ది హోల్డోవర్స్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది కానీ ఇంకా మన దేశంలో స్ట్రీమింగ్‌కు రాలేదు. మార్చి 29 నుంచి రెంట్ పద్దతిలో బుక్ మై షో స్ట్రీమ్ ఓటీటీలో అందుబాటులో ఉండనుంది.
ఉత్తమ సౌండ్ విభాగంలో అవార్డు దక్కించుకున్న ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (The Zone of Interest) , బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డు సాధించిన అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ (Anatomy of a Fall) చిత్రాలతో పాటు, ఉత్తమ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగంలో అవార్డు దక్కించుకున్న వార్, డ్రామా డాక్యుమెంటరీ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (The Zone of Interest), ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా చరిత్రలో మొట్టమొదటి సారిగా అస్కార్ అవార్డు దక్కించుకున్న 20 డేస్ ఇన్ మరియోపోల్ (20 Days in Mariupol) అనే ఉక్రేయిన్ (Ukrain) డాక్యుమెంటరీలు ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉన్నాయి కానీ ది కానీ ఇంకా మన దేశంలో స్ట్రీమింగ్‌కు రాలేదు.
అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది కానీ ఇంకా మన దేశంలో స్ట్రీమింగ్‌కు రాలేదు.ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది కానీ ఇంకా మన దేశంలో స్ట్రీమింగ్‌కు రాలేదు. అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది కానీ ఇంకా మన దేశంలో స్ట్రీమింగ్‌కు రాలేదు.
వీటితో పాటు ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విబాగంలో అవార్డు సాధించిన జపనీస్ చిత్రం గాడ్జిల్లా మైనస్ వన్ (Godzilla Minus One), బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు సాధించిన ది బాయ్ అండ్ ది హిరాన్ (The Boy and the Hiran) చిత్రాలు ఇంకా థియేటర్లలో నడుస్తుండడంతో ఓటీటీ ఫ్లాట్ ఫాంలు సెట్ అవ్వలేదు. మ్యాగ్జిమం ఈనెలాఖరున ఈ చిత్రాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి.