Nick Jonas: షో మధ్య నుండి వెళ్లిపోయిన నిక్.. ప్రియాంక చోప్రా భర్తకేమైందంటే..
ABN, Publish Date - Oct 16 , 2024 | 02:53 PM
ఈవెంట్‌లో మ్యూజిక్ పాడుతున్న నిక్ జోనస్ సడెన్‌గా వేదిక నుండి పారిపోయాడు. ఇంతకీ ఏమైందంటే..
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త (Priyanka Chopra), ప్రముఖ ఇంటర్నేషనల్ పాప్ సింగర్ నిక్ జోనస్ (Nick Jonas) లైవ్ షో నుండి పరుగెత్తడంతో ఇంటర్నెట్‌లో హల్ చల్ జరుగుతోంది. నిక్ తన సోదరులు కెవిన్ అండ్ జోలతో కలిసి మ్యూజిక్ బ్యాండ్ ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా ఈ ముగ్గురు కలిసి ప్రేగ్‌లో జరిగిన ఒక లైవ్ షోలో పాల్గొన్నారు. ఈవెంట్‌లో మ్యూజిక్ పాడుతున్న నిక్ జోనస్ సడెన్‌గా వేదిక నుండి పారిపోయాడు. ఇంతకీ ఏమైందంటే..
నిక్ జోనస్ చాలామంది భారతీయులకు ప్రియాంక చోప్రా భర్తగా మాత్రమే తెలుసు. కానీ.. ఆయన తన సోదరులు
జో, కెవిన్ లు 'జోనస్ బ్రదర్స్' (Jonas Brothers) గా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్. తాజాగా ప్రేగ్ లో పాప్ మ్యూజిక్ ఈవెంట్ నిర్వహించారు. అయితే షోలో నిక్ మ్యూజిక్ పాడుతూ సడెన్‌గా పరిగెత్తాడు. దీంతో అంత ఒక్కసారి ఏమైందని షాక్‌కి గురయ్యారు. ఎవరో రెడ్ కలర్ లేజర్ లైట్‌ని నిక్ మొహంపై వేశారు. దీంతో కంగారు పడిన నిక్ పరిగెత్తాడు. తనతో పాటు సెక్యూరిటీ సిబ్బందికి కూడా సైగ చేశాడు. దీంతో షో ని కొద్దిసేపు నిలిపేశారు. దీంతో ఫ్యాన్స్ భద్రత చర్యలపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అదేం డేంజర్ లైట్ కాదని, ఒక ఆకతాయి పనిగా పోలీసులు గుర్తించి అతనిని అదుపులోకి తీసుకున్నారు.