Oppenheimer : మూడేళ్ల కష్టం.. సవాళ్లు.. విమర్శలు.. ఆస్కార్!
ABN, Publish Date - Mar 11 , 2024 | 11:34 AM
‘ఓపెన్‌హైమర్’ (Oppenheimer) చిత్రం ఆస్కార్ వేదికపై సత్తా చాటింది. ముందు నుంచీ ఊహించినట్లుగానే ఆస్కార్‌ను (Oscar 2024) కైవసం చేసుకుంది. అంతే కాదు ఏడు విభాగాల్లో అవార్డులు అందుకుని సత్తా చాటింది. ప్రస్తుతం ఎక్కడ చేసిన ఈ చిత్రం గురించే చర్చ.
‘ఓపెన్‌హైమర్’ (Oppenheimer) చిత్రం ఆస్కార్ వేదికపై సత్తా చాటింది. ముందు నుంచీ ఊహించినట్లుగానే ఆస్కార్‌ను (Oscar 2024) కైవసం చేసుకుంది. అంతే కాదు ఏడు విభాగాల్లో అవార్డులు అందుకుని సత్తా చాటింది. ప్రస్తుతం ఎక్కడ చేసిన ఈ చిత్రం గురించే చర్చ. క్రిస్టఫర్ నోలన్(Christopher Nolan) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు...
క్రిస్టఫర్ నోలన్ తెరకెక్కించిన మొదటి బయోపిక్ ‘ఓపెన్‌హైమర్’. దీన్ని ‘ది ట్రయంఫ్ అండ్ ట్రాజెడీ ఆఫ్ జె రాబర్ట్ ఓపెన్‌హైమర్’ అనే పుస్తకం ఆధారంగా రూపొందించారు. కథ రెడీ అయినప్పటి నుంచి ఈ చిత్రం కోసం మూడేళ్లు కష్టపడ్డారు దర్శకుడు క్రిస్టఫర్ నోలన్. ఆయన దర్శకత్వంలో 2020లో వచ్చిన ‘టెనెట్’ తర్వాత పూర్తిగా ఈ చిత్రంపైనే శ్రద్థ పెట్టారు. తెరకెక్కించే తరుణంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా కీలకంగా భావించి విజువల్ వండర్‌ను సృష్టించారు. ఆయనతోపాటు టీమ్ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలంగా ప్రతిష్ఠాత్మక ఆస్కార్ వరించింది. (Oppenheimer-OScar)
‘ఓపెన్‌హైమర్’ సినిమా నిడివి ఎక్కువే. గతంలో ఆయన తెరకెక్కించిన చిత్రం ఇంటర్ 'స్టెల్లార్' 2గంటల49 నిమిషాలు కాగా, ఈ చిత్రం మూడు గంటల రన్టైమ్తో రూపొందింది. ఆయన చిత్రాల్లో తొలి స్థానంలో నిలిచింది. రన్‌టైమ్‌లో పెద్ద చిత్రం అయినప్పటికీ ప్రేక్షకులు విసిగిపోకుండా ఆదరించారు.
నోలన్ చిత్రాల్లో మనసును కదిలించే సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, ‘ఓపెన్‌హైమర్’లో మొదటిసారి ఓ శృంగార సన్నివేశాన్ని పెట్టారు. ఈ సీన్‌పై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఇంతకు ముందు ఎప్పుడూ చేయని పనులు చేయాలంటే సవాల్‌గా ఉంటుంది. ఈ సీన్ పెట్టడానికి భయపడ్డాను. కథకు అవసరం అనిపించినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని ఆ సన్నివేశాన్ని పెట్టాను’’ అని అన్నారు.
ఇలాంటి విజువల్ వండర్‌కు కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ(సీజీఐ)ను ఉపయోగించడం తప్పనిసరి. కానీ ఆ విధానాన్ని ఉపయోగించకపోవడం గమనార్హం. ఇందులోని న్యూక్లియర్ పేలుడు సన్నివేశాలతో కూడిన క్లైమాక్స్ సీజీఐ సాయం లేకుండా రీక్రియేట్ చేశారు దీని గురించి దర్శకుడు ఓ సందర్భంలో చెప్పారు. క్వాంటమ్ డైనమిక్స్, ఫిజిక్స్‌ను వీలైనంత వాస్తవికంగా చిత్రీకరించాలనుకొని ఇలా చేసినట్లు తెలిపారు.
గతేడాది జులై 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ సినిమాలో ఓ శృంగార సన్నివేశంలో మతగ్రంథాలను చూపించడంపై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కరెక్ట్ కాదంటూ పోస్ట్‌లు పెట్టారు. ఆ సీన్‌ను తొలగించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే! వీటి అన్నింటిని దాటుకుని ప్రపంచ సినిమా ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ ను తన వశం చేసుకుంది ఈ సినిమా. (Oppenheimer)