US Election 2024: అమెరికా ఎండ్‌గేమ్‌లో.. 'ఎవెంజర్స్' ఎటు వైపు అంటే..
ABN, Publish Date - Nov 06 , 2024 | 11:09 AM
అగ్ర రాజ్యం అమెరికా ఎన్నికల హోరులో హాలీవుడ్ సెలబ్రిటీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎలక్షన్స్‌కి ముందు తర్వాత హడావిడి చేసి ఫలితాలలో తమ ఇంప్యాక్ట్ చూపే ప్రయత్నం చేశారు. భారత మూలాలున్న కమలా హ్యారిస్ వెనుక చాలా మంది సెలబ్రిటీస్ నిలబడ్డారు. మరోవైపు కొందరు ట్రంప్‌కి సపోర్ట్ చేశారు. ఇంకా కొందరు యూత్ ఎన్నికల్లో పాల్గొనేందుకు తమ స్టైల్ లో ప్రచారం చేశారు. ఇంతకీ ఎవరెవరు ఎం చేశారంటే..
అమెరికా తదుపరి ప్రెసిడెంట్ ఎవరు?. తొలిసారి ఒక మహిళ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడుతారా? లేక డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారా?.. అనే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లోనే తెరపడనుంది. అయితే ఈ ఎన్నికల హోరులో హాలీవుడ్ సెలబ్రిటీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎలక్షన్స్ కి ముందు తర్వాత హడావిడి చేసి ఫలితాలలో తమ ఇంప్యాక్ట్ చూపే ప్రయత్నం చేశారు. భారత మూలాలున్న కమలా హ్యారిస్ వెనుక చాలా మంది సెలబ్రిటీస్ నిలబడ్డారు. మరోవైపు కొందరు ట్రంప్‌కి సపోర్ట్ చేశారు. ఇంకా కొందరు యూత్ ఎన్నికల్లో పాల్గొనేందుకు తమ స్టైల్ లో ప్రచారం చేశారు. ఇంతకీ ఎవరెవరు ఎం చేశారంటే..
ఎలక్షన్స్ ఎండ్ గేమ్‌లో 'ఎవెంజర్స్'
అగ్ర రాజ్యం అమెరికా ఎన్నికలపై ప్రపంచం మొత్తం దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే 'ఎవెంజర్స్' స్టార్స్ స్కార్లెట్ జాన్సన్, మార్క్ రుఫెలో, రాబర్ట్ డౌనీ జూనియర్, డాన్ చీడెల్, పాల్ బెట్టనీ, డానై గురిరా, క్రిస్ ఎవాన్స్ సోషల్ మీడియా వేదికగా సమావేశమై వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్‌కే తమ సపోర్ట్ అంటూ తీర్మానించారు. బెటర్ అమెరికా కోసం అందరు తమ ఓట్లను కమలాకే వేయాలని సూచించారు.
ప్రముఖ పాప్ సింగర్స్ కాటి పెర్రీ, లేడీ గాగా, క్రిస్టినా అగ్యిలేరా, రికీ మార్టిన్ లు కూడా ఎలక్షన్స్ ముందు రోజు కమలా హ్యారిస్ కి మద్దతుగా ఫిలడెల్ఫియాలో ప్రదర్శనలతో తమ గళం వినిపించారు. మరోవైపు సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కూడా కమలాకే ఓటు వేయాలని సూచించారు.
ఇక మోస్ట్ పవర్‌ఫుల్ అండ్ రిచెస్ట్ యాక్టర్ రీస్ విథర్‌స్పూన్ తాను కమలాకి ఓటు వేశాను. మీ ఓటు ఎవరికీ అంటూ ప్రశ్నించారు.
ఇక అమెరికన్ టీవీ దిగ్గజం, ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ కైట్లిన్ జెన్నర్ కాలిఫోర్నియాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేసినట్లు చూపిస్తూ తన బ్యాలెట్ చిత్రాన్ని పోస్ట్ చేసింది.
ఇక మంగళవారం మొత్తం పోల్స్‌లో నటుడు పాల్ రూడ్‌తో సహా కొంతమంది ప్రముఖుల న్యూస్ ఎనాలసిస్‌లో పాల్గొన్నారు. ఆయన పెన్సిల్వేనియాలోని స్వింగ్-స్టేట్‌లోని విల్లనోవా యూనివర్శిటీలో ఓటర్లను హైడ్రేట్ చేయడానికి నీటిని అందజేశారు. "వారు చాలా సేపటి నుండి లైన్‌లో వేచి ఉన్నారు. ఈ యువకులందరూ ఓటు వేయడం అద్భుతమైన విషయం" అంటూ మీడియాతో మాట్లాడారు.
ఇక ముంబైలో పుట్టిన అమెరికన్ యాక్ట్రెస్ 'ఆకాంక్ష రంజన్ కపూర్' కమలా హ్యారిస్‌కి వోట్ వేసినట్లు పోస్ట్ చేసింది.