రెండు నెలల్లో నలుగురు పోర్న్ స్టార్స్ మృతి.. అసలేమైంది?
ABN, Publish Date - Mar 10 , 2024 | 07:13 PM
హాలీవుడ్ అడల్ట్ మూవీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. కేవలం రెండు నెలల్లో నలుగురు పోర్న్ స్టార్లు చనిపోవడం షాక్‌కు గురి చేస్తోంది. మొదట జనవరి 6న తైనా ఫీల్డ్స్, జనవరి 24న జెస్సీ జేన్, ఫిబ్రవరి 15న కాగ్నీ లిన్ కార్టర్, తాజాగా సోఫియా లియోన్ మరణించగా వారి మరణాలు మాత్రం సాధారణ మరణం కాక పోవడం గమనించాల్సిన అంశం.
హాలీవుడ్ అడల్ట్ మూవీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. కేవలం రెండు నెలల్లో నలుగురు పోర్న్ స్టార్లు చనిపోవడం షాక్‌కు గురి చేస్తోంది. మొదట జనవరి 6న తైనా ఫీల్డ్స్ (Thaina Fields) , జనవరి 24న జెస్సీ జేన్ (Jesse Jane), ఫిబ్రవరి 15న కాగ్నీ లిన్ కార్టర్ (Kagney Linn Karter) చనిపోగా తాజాగా మార్చి 1న సోఫియా లియోన్ (Sophia Leone) మరణించగా మార్చి 9న వెలుగులోకి వచ్చింది. అయితే వీరంతా స్టార్ స్టేటస్ ఉన్న నటీమణులు కాగా వారి మరణాలు మాత్రం సాధారణ మరణం కాక పోవడం గమనించాల్సిన అంశం. వీరు ఇప్పుడిప్పుడే బయట సినిమాలు, టీవీ షోలలో అవకాశాలు దక్కించుకుంటుండగా, ఆ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చాక ఈ ఘటనలు జరగడం అక్కడ చర్చనీయాంశంగా మారుతున్నాయి.
మొదటగా పెరూకి చెందిన తైనా ఫీల్డ్స్ (25) (Thaina Fields) తన ఇంటిలో జనవరి 6న అచేతనంగా పడి ఉన్నట్లు ఆమె కుటుంబ సభ్యులు గుర్తించగా అమె మరణంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే తైనా చనిపోక మునుపు రెండు నెలల కిందట అడల్ట్ ఇండస్ట్రీలో జరుగుతున్న అరాచకాలపై ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఈ ఘటన జరగడంతో తైనా మరణం వివాదాస్పదంగా మారింది. దీంతో పొలీసులు అనుమానస్పద మృతి కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా జనవరి 24న జెస్సీ జేన్ (Jesse Jane) అనే మరో నటి కూడా జనవరి 24న తన నివాసంలో చనిపోయి ఉన్న స్థితిలోనే పొలీసులు గుర్తించారు. డ్రగ్స్ ఓవర్ బోస్ అవడం వళ్ల చనిపోయినట్లు నిర్ధారించారు.
ఇక ఫిబ్రవరి 15న కాగ్నీ లిన్ కార్టర్ (Kagney Linn Karter) అనే నటి తన 36 ఏండ్ల వయస్సుల్లో నివాసంలోనే ఆత్మహత్య చేసుకుని మరణించింది. దానికి గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. మల్టిపుల్ టాలెంటెడ్‌గా పేరున్న ఈ నటి ఆడల్ట్ సినిమాలకు గుడ్ బై చెప్పి సొంతంగా ఫిట్నెస్ స్టూడియో పెట్టుకున్న కొద్ది రోజుల్లోనే ఈ బలవన్మరణం జరగడం కొత్త చర్చలకు సైతం దారి తీసింది.
ఇక తాజాగా సోఫియా లియోన్ (Sophia Leone) కూడా తను నివాసముండే ఇంటిలోనే చనిపోయి కనిపించడంతో ఆమె పెంపుడు తండ్రి అంత్యక్రియలకు డబ్బులు కావాలని ఓ సంస్థను కోరడంతో సోఫియా మరణ వార్త బయటకు వచ్చింది. ఈ నటి మృతిపై కూడా ప్రశ్నలు తలెత్తడంతో అనుమానాస్పద మరణం కిందనే ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇలా కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఇలా నలుగురు పేరున్న నటీమణులు చనిపోవడం బాధాకరమైనప్పటికీ ఇప్పుడు సర్వత్రా ఆ అసలు ఆ ఇండస్ట్రీలో ఏం జరుగుతన్నదనే ప్రశ్నలు ఉతత్పన్నమవుతున్నాయి. అంతేగాక పోర్న్ స్టార్ జీవితాలు మనం అనుకునేంత పూల పాన్పులు కావని, వాటి వెనకాల రక్త చరిత్రలు అంతకుమించి అనేలా ఉంటాయని ప్రస్తుతం అక్కడి పత్రికలలో వస్తున్న కథనాలు తెలియజేస్తున్నాయి.
ఈ మధ్య చనిపోయిన నలుగురిలో ముగ్గురు 25 ఏండ్ల వారు కాగా మరొకరికి 35 ఏండ్లు మాత్రమే. తమ కుటంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కేవలం 16, 18 ఏండ్ల వయసులో ఈ ఫీల్డ్ లోకి రావడం అక్కడ మితీమీరిన డ్రగ్స్ వాడకం, ఇక్కడా ఉండే రాజకీయాలు, ఏజెన్సీల మధ్య పోటీలు, అగ్రిమెంట్లు, ఇచ్చే డబ్బులు ఇత్యాది సమస్యల మధ్య వారి జీవితాలు చూసేవారికి ఆడంబరంలా కనిపిస్తున్నా అడవి కాచిన వెన్నెల లాగా మధ్యలోనే మాయమవుతున్నాయి.