Johnny Wactor: అమెరికాలో దారుణం.. ప్రముఖ హాలీవుడ్ నటుడు కాల్చివేత
ABN, Publish Date - May 27 , 2024 | 10:37 AM
అమెరికాలో దుండగులు మరోసారి రెచ్చిపోయారు. ఓ కారులో దోపిడీ చేస్తూ అగంతకులు జరిపిన కాల్పుల్లో ప్రముఖ హాలీవుడ్ వెబ్ సిరీస్ నటుడు జానీ వాక్టర్ (37) మరణించాడు.
అమెరికాలో దుండగులు మరోసారి రెచ్చిపోయారు. ఓ కారులో దోపిడీ చేస్తూ అగంతకులు జరిపిన కాల్పుల్లో ప్రముఖ హాలీవుడ్ వెబ్ సిరీస్ నటుడు జానీ వాక్టర్ (37) ( Johnny Wactor) మరణించాడు. శనివారం తెల్లవారు జామున లాస్ ఏంజిల్స్ డౌన్‌టౌన్‌లో ఈ దుర్ఘటన జరిగినట్లు వాక్టర్ తల్లి స్కార్లెట్ మీడియాకు తెలిపింది. ఆ సమయంలో వాక్టర్ వెంట అతని సహొద్యోగి మాత్రమే ఉన్నాడని తెలిపింది.
ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వాక్టర్ కారు వద్ద కాటలిక్ట్ కన్వర్టర్‌ను దొంగిలించే క్రమంలో తీవ్రంగా వాదులట జరుగగా దుండగులు కాల్పులు జరిపారని తీవ్రంగా గాయపడ్డ వాక్టర్ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని తెలిపింది. ఈ ఘటన జరిగిన వెంటనే నిందితులు అక్కడి నుంచి పారిపోగా పోలీసులు వారి కోసం వెతుకుతున్నారు. కాగా జానీ వాక్టర్ (Johnny Wactor) తల్లి స్కార్లెట్, లాన్స్, గ్రాంట్ అనే ఇద్దరు సోదరులతో కలిసి ఉంటున్నారు.
2007లో వచ్చిన లైఫ్‌టైమ్ డ్రామా సిరీస్ ఆర్మీ వైవ్స్ అనే టీవీ షోతో మొదటి సారి తన కెరీర్ ఆరంభించిన జానీ వాక్టర్ ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా కెరీర్ కొనసాగింది. ఈ క్రమంలో ఆయన ‘వెస్ట్‌వరల్డ్ (West world), ది ఓ (The OA), NCIS, స్టేషన్ 19 (Station 19), క్రిమినల్ మైండ్స్ (Criminal Minds), హాలీవుడ్ గర్ల్’ (Hollywood Girl) వంటి పేరున్న సిరీస్‌లు, షోలలో నటించాడు.
ముఖ్యంగా జనరల్ హస్పటల్ (General Hospital) అనే షో జానీ వాక్టర్ (Johnny Wactor)కు ఎనలేని గుర్తింపు తెచ్చి పెట్టింది. 1963లో ప్రారంభమై న ఈ షోలో ఆయన 2020 నుంచి 2022 వరకు దాదాపు 200 ఎపిసోడ్స్‌లలో నటించగా అది ఆయనకు ఎనలేని బాగా ప్రాచుర్యం తెచ్చి పెట్టింది. అందులో ఆయన పోషించిన బ్రాండో కార్బిన్ క్యారెక్టర్ ఇప్పటికీ చాలా మందికి ఫెవరేట్. అంతేగాక ఆయనను ఆ పేరుతోనే పిలవడం లేకుంటే GH జానీ అంటూ సంబోధించండం విశేషం.
జానీ వాక్టర్ జానీ వాక్టర్ (Johnny Wactor) మరణ వార్త విన్న తోటి నటులు, జనరల్ హస్పటల్ (General Hospital) షో టీం తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ఈ సందర్భంగా వాక్టర్‌తో వారికి ఉన్న అనుభవాలను పంచుకున్నారు. ఇక వార్త తెలిసిన ఆయన అభిమానులు చాలామంది శోక సంద్రంలో మునిగిపోయారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులర్పిస్తున్నారు.