Deadpool And Wolverine: హాలీవుడ్ హీరోలకు కటౌట్లు.. ఇదెక్కడి మాస్ రా మామ‌! తెలుగోళ్లంతే మ‌రి

ABN, Publish Date - Jul 15 , 2024 | 09:15 PM

ఈ నెల చివ‌ర‌లో ఓ భారీ చిత్రం డెడ్ పుల్ & వాల్వరిన్ విడుద‌ల‌కు రెడీ అయింది. అయితే గ‌తంలో ఏ చిత్రం విష‌యంలో జ‌రుగ‌ని విధంగా, తెలుగు స్టార్ హీరోల‌కు మాత్ర‌మే జ‌రిగే హంగామా, సంంద‌డి ఈ సినిమా విష‌యంలో జ‌రుగుతుండ‌డం అంద‌రినీ షాక్‌కు గురి చేస్తోంది.

Deadpool And Wolverine

గ‌డిచిన‌ రెండు మూడు మాసాల్లో ప్ర‌తి నెల‌లో ఏదో ఒక హాలీవుడ్ డ‌బ్బింగ్ చిత్రం మ‌న ద‌గ్గ‌ర థియేట‌ర్ల‌లో విడుద‌లై క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తున్నాయి. ఇప్ప‌టికే ఫ్లానెట్ ఆఫ్‌ ది ఏప్స్‌, గాడ్జిల్లా వ‌ర్సెస్ కాంగ్‌, క్వైట్ ఫ్లేస్ అంటూ మూడు నాలుగు భారీ చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి అల‌రించాయి. తాజాగా ఈ కోవ‌లోనే ఈ నెల చివ‌ర‌లో ఓ భారీ చిత్రం డెడ్ పుల్ & వాల్వరిన్ (Deadpool And Wolverine) విడుద‌ల‌కు రెడీ అయింది.

అయితే గ‌తంలో ఏ చిత్రం విష‌యంలో జ‌రుగ‌ని విధంగా, తెలుగు స్టార్ హీరోల‌కు మాత్ర‌మే జ‌రిగే హంగామా, సంంద‌డి ఈ సినిమా విష‌యంలో జ‌రుగుతుండ‌డం అంద‌రినీ షాక్‌కు గురి చేస్తోంది. మాములుగా మార్వెల్ సినిమాలంటే చెవి కోసుకునే అభిమానులు కోట్ల‌లో ఉంటారు అలాంటిది ఈ సారి ఇద్ద‌రు సూప‌ర్ హీరోలు ఒకే చిత్రంలో పోటీ ప‌డుతుండ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. దీంతో అభామానులు కూడా త‌మ స్టైల్‌లోనే త‌మ అభిమానాన్ని ఇప్ప‌టి నుంచే చూపుతున్నారు.


సినిమా విడుద‌ల‌కు ఇంకా రెండు వారాల స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ.. అప్పుడే అభిమానులు సంబురాలు మొద‌లు పెట్టారు. మ‌న హీరోల‌కు చేసే విధంగా ఈ హాలీవుడ్‌ సినిమా హీరోల భారీ క‌టౌట్ల‌ను ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని థియేట‌ర్ల‌లో ఏర్పాటు చేసి హంగామా సృష్టిస్తున్నారు.

ఈ సెల‌బ్రేష‌న్ వీడియోలు ప్ర‌స్తుతం నెట్ లో వైర‌ల్ అవుతున్నాయి. ఇప్ప‌టికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేయ‌డంతో టికెట్ల కోసం ఎగ‌బ‌డుతున్నారు. మార్వెల్ యూనీవ‌ర్స్ నుంచి డెడ్ పుల్ సిరీస్ లో వ‌స్తున్న డెడ్ పుల్ & వాల్వరిన్ (Deadpool And Wolverine) మూవీ జూలై 26న థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది.

ఇప్ప‌టికే ఈ సినిమా (Deadpool And Wolverine) సంబంధించిన ట్రైల‌ర్ యూట్యూబ్ లో మిలియ‌న్స్ కొద్దీ వ్యూస్ అందుకోవ‌డంతో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న మార్వెల్ ఫ్యాన్స్ లో ఉత్కంఠ రేపుతోంది. ఈసారి డెడ్ పుల్‌తో క‌లిసి వాల్వ‌రిన్ కూడా వెండితెర పై అద్భుత విన్యాసాలు చేయ‌బోతుండ‌గా అగ్ర న‌టులు ర‌య‌న్ రెనాల్డ్స్ (Ryan Reynolds), హుయ్ జాక్ మెన్ (Hugh Jackman) క‌థానాయకులుగా న‌టించారు. దీంతో ఈ చిత్రం మోస్ట్ ఫెవ‌రేట్ మార్వెల్ మూవీగా రికార్డులు క్రియేట్ చేస్తుంది.

Updated Date - Jul 15 , 2024 | 09:15 PM