OTT: ఓటీటీలోకి.. భారీ బడ్జెట్ హాలీవుడ్ చిత్రాలు
ABN, Publish Date - Jan 10 , 2024 | 05:29 PM
గత సంవత్సరం థియేటర్లలో విడుదలైన మూడు హాలీవుడ్ చిత్రాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధం అయ్యాయి. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూడు భారీ బడ్జెట్ చిత్రాలు మిశ్రమ స్పందనను రాబట్టుకున్నాయి. అవేంటో మీరూ ఓసారి చూసి మీ సమయాన్ని బట్టి వీక్షించండి.
గత సంవత్సరం థియేటర్లలో విడుదలైన మూడు హాలీవుడ్ చిత్రాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధం అయ్యాయి. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూడు భారీ బడ్జెట్ చిత్రాలు మిశ్రమ స్పందనను రాబట్టి అనుకున్నంత కలెక్షన్లను రాబట్టలేకపోవడం గమనార్హం. అవేంటో మీరూ ఓసారి చూసి మీ సమయాన్ని బట్టి వీక్షించండి.
2023 నవంబర్ 10న విడుదలైన సూపర్ హీరో చిత్రం ది మార్వెల్స్ (The Marvels.). 2019లో వచ్చిన కెప్టెన్ మార్వెల్ చిత్రానికి సీక్వెల్‌గా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో 33వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ చిత్రంగా నిలిచింది. నియా డకోస్టా ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కరోల్ డాన్వర్స్ (కెప్టెన్ మార్వెల్)గా బ్రీ లార్సన్ నటించగా, మోనికా రాంబ్యూగా టెయోనా ప్యారిస్, కమలా ఖాన్ (మిస్ మార్వెల్)గా ఇమాన్ నటించారు.
తమ పవర్స్‌తో ఓ గ్రహం నుంచి మరో గ్రహంలోకి ట్రావెలింగ్ చేస్తూ ఆయా గ్రహాలలోని శతృవులతో పోరాటం చేస్తూ విశ్వాన్ని ఎలా కాపాడారనే ఇతివృత్తంలో ఉంటుంది. ఈ సినిమా అంతా గజిబిజీగీ ఉండి పెద్దవాళ్లకు అర్ధం అవకున్నా పిల్లలు యమాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ సినిమాను జనవరి 16 నుంచి కొన్ని డిలీటెడ్ సీన్లు కలిపి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus HS)లో స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నారు. ఇదిలా ఉండగా మార్వెల్‌కు చెందిన ఓ వెబ్ సిరీస్ ఎకో (ECHO) సీజన్ 1 ఈ రోజు నుంచి మల్టీ లాంగ్వేజెస్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది.
ఇదే కోవలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తున్న మరో చిత్రం బ్లూ బీటిల్స్ (Blue Beetle). DC ఎక్స్‌టెండెడ్ యూనివర్స్‌లో 14వ చిత్రంగా 2023 ఆగస్లు 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్నే అందుకున్నది. ఈ చిత్రానికి ఏంజెల్ మాన్యుయెల్ సోటో దర్శకత్వం వహించారు. ఓ పురాతన గ్రహాంతర అవశేషాల వల్ల అనుకోకుండా సూపర్ పవర్స్ పొందిన హీరో తర్వాత ఏం చేశాడనే కథ నేపథ్యంలో చిత్రం ఉంటుంది. సినిమా ఆద్యంతం విజువల్స్, గ్రాఫిక్స్ మనల్ని ఇట్టే కట్టి పడేస్తాయి. ఈ చిత్రం జనవరి 18 నుంచి జియో సినిమాలో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ, మళయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవనుంది.
ఇక వీటన్నింటితో పాటు 2023 నవంబర్ 22న విడుదలైన ఎపిక్, హిస్టారికల్ డ్రామా ఫిల్మ్ నెపోలియన్ (Napoleon) ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతున్నది.