Immaculate: భయపెట్టడానికి వచ్చేసిన.. బోల్డ్ బ్యూటీ, ప్రోఫెసర్! థియేటర్లలోకి అదిరిపోయే హర్రర్ థ్రిల్లర్
ABN, Publish Date - Jul 19 , 2024 | 09:33 AM
హర్రర్ చిత్రాలను, హాలీవుడ్ సినిమాలను ఇష్టపడే వారి కోసం ఈ వారం ఓ భారీ సస్పెన్స్ , హర్రర్ థ్రిల్లర్ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. హాలీవుడ్ బోల్డ్ స్టార్ సిడ్నీ స్వీనీ, మనీ హిస్ట్ ఫేమ్ ప్రోఫెసర్ అల్వారో మోర్టే నటించిన చిత్రం ఇమ్మక్యూలేట్ తాజాగా భారతీయ థియేటర్లలో విడుదలైంది.
హర్రర్ చిత్రాలను, హాలీవుడ్ సినిమాలను ఇష్టపడే వారి కోసం ఈ వారం ఓ భారీ సస్పెన్స్ , హర్రర్ థ్రిల్లర్ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. సిడ్నీ స్వీనీ (Sydney Sweeney), అల్వారో మోర్టే (Álvaro Morte) ప్రధాన పాత్రల్లో వచ్చిన ఆ చిత్రం ఇమ్మక్యూలేట్ (Immaculate). మార్చ్ 22నే అమెరికాలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు మన దేశంలో రిలీజైంది. 9 మిలియన్లతో తెరకెక్కిన ఈ సనిమా 277 మిలియన్లకు పైగా వసూళ్లను రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. గంట 28 నిమిషాల నిడివితో ఉన్న ఈ హరర్ర్ చిత్రంలో ప్రధాన ఆకర్శణ కథానాయిక సిడ్నీ స్వినీ (Sydney Sweeney) కాగా , ఫేమస్ మనీహిస్ట్ (Money Heist) సిరీస్‌ప్రోఫెసర్ అల్వారో మోర్టే (Álvaro Morte), బెనెడెట్టా పోర్కరోలి (Benedetta Porcaroli), డోరా రొమానో (Dora Romano), జార్జియో కొలంజెలి (Giorgio Colangeli)సిమోనా టబాస్కో (Simona Tabasco) వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. మైఖెల్ మోహన్ ( Michael Mohan) దర్శకత్వం వహించారు.
కథా నేపథ్యం విషయానికి వస్తే.. సిసిలియా అనే యువతి మిచిగాన్ సిటీ నుంచి వెళ్లి ఇటలీలోని ఓ కాన్వెంట్‌లో చేరుతుంది. ఫాదర్ సాల్ టెడెస్చి అధ్వర్యంలో ప్రమాణాలు చేసి నన్‌గా మారి అప్పటికే అక్కడ ఉంటున్న వృద్ధ నన్స్‌కు సేవలు చేస్తూ ఉంటుంది. అయితే ఇసాబెలా అనే నన్ సిసిలియా రావడం నచ్చక అమెను చంపాలని చూస్తుంది. అంతేగాక సిసిలియాకు ఆ కాన్వెంట్‌లోప్రతి రోజూ వింత అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. విచిత్ర ఘటనలు తారసపడతాయి. భయానకమైన కలలు వస్తుంటాయి. ఎవరెవరో వచ్చి ఇక్కడి నుంచి పారిపో అంటూ సలహాలు ఇస్తూ ఉంటారు.
అయితే ఈ క్రమంలోనే ఓ రోజు సిసిలియా గర్భవతి అయినట్టు తెలుసుకుని షాక్ అవుతుంది. ఎలాంటి ఫిజికల్ రిలేషన్ లేకుండా ప్రెగ్నెంట్ అయింది ఈమె మరో మేరిమాత జీసస్ మరోమారు పుట్ట బోతున్నాడంటూ అక్కడి వారంతా సిసిలియాను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అసలు సిసిలియా ఆ కాన్వెంట్‌లోనే ఎందుకు చేరాల్సి వచ్చింది, అంతకుముందే పరిచయం ఉందా, సిసిలియాను చంపడానికి ఎందుకు ప్రయత్నించారు, సూసైడ్స్ ఎందుకు జరిగాయి, ఆ ఫాదర్ ఎవరు, అసలు తనకు తెలియకుండా గర్భం ఎలా వచ్చిందనే ఆసక్తికర కథ కథనాలతో సినిమా సాగుతూ ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ను ఇస్తుంది.
కాన్వెంట్‌లో జరుగుతన్న విషయాలు ఒక్కొక్కటే తెలుసుకున్నాక సిసిలియా అక్కడి నుంచి బయట పడగలిగిందా లేదా, కాన్వెంట్ మాటున దాగిన రహస్యం ఏంటి అనే ఫాయింట్, క్లైమాక్స్‌లో చ్చే ట్విస్టులు గూస్‌బమ్స్ తెప్పిస్తాయి. అక్కడక్కడ బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయి కానీ కథలో భాగంగానే వస్తాయి. ఇక మన అందకరికి నచ్చిన ఫ్రోఫెసర్ అల్వారో మోర్టే ఈ సినిమాలో ఫాదర్ ఇంతవరకు చేయని రోల్‌లో నటించి అదరగొడతాడు. సో హర్రర్ మూవీ లవర్స్ ఈ వారం థియేటర్లలో ఈ సినిమాను మిస్ చేయకుండా చూడండి తప్పక నచ్చుతుంది.