Ritu Varma: సందీప్ కిషన్ పక్కన నక్కిన డైరెక్షన్ లో రీతు వర్మ

ABN , Publish Date - Jun 20 , 2024 | 06:29 PM

నక్కిన త్రినాథ రావు, రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ మరోసారి చేతులు కలిపి ఈసారి సందీప్ కిషన్, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో #SK30 చేస్తున్న సగంతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ కూడా నిన్ననే మొదలయ్యింది. ఈ సినిమాలో రావు రమేష్ పక్కన ఒకప్పటి కథానాయిక అన్షు అంబానీ నటిస్తుండగా, సందీప్ కిషన్ పక్కన రీతు వర్మ చేస్తోందని సమాచారం.

Ritu Varma: సందీప్ కిషన్ పక్కన నక్కిన డైరెక్షన్ లో రీతు వర్మ
Ritu Varma

దర్శకుడు నక్కిన త్రినాథ రావు ఇప్పుడు మంచి ఫామ్ లో వున్నారు. అతను, రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ కాంబినేషన్ లో ఇంతకు ముందు రవితేజతో 'ధమాకా' అనే ఒక పెద్ద హిట్ సినిమా ఇచ్చారు. అంతకు ముందు నానితో 'నేను లోకల్' సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయింది. మధ్యలో రామ్ పోతినేనితో 'హలో గురు ప్రేమకోసమే' కూడా వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిందే. అయితే ఆ సినిమా యావరేజ్ అన్నారు. (Ritu Varma is playing the female lead opposite Sundeep Kishan in a film directed by Nakkina Trinadha Rao)

rituvarmawithsundeepkishan.jpg

ఇలా వరస విజయాలతో దూసుకు వెళుతున్న దర్శకుడు నక్కిన త్రినాథ రావు (Nakkina Trinadha Rao), రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ ఇప్పుడు సందీప్ కిషన్, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో ఒక సినిమా రూపుదిద్దుకుంటోంది. (Ritu Varma signed another Telugu film and this time opposite Sundeep Kishan, which is directed by Nakkina Trinadha Rao) రావు రమేష్ పక్కన ఒకప్పటి 'మన్మధుడు' కథానాయిక అన్షు అంబానీ (Anshu Ambani) చేస్తుండగా, సందీప్ కిషన్ పక్కన 'పెళ్లి చూపులు' భామ రీతు వర్మ చేస్తోంది అని సమాచారం.

rituvarmawithsundeepkishana.jpg

సందీప్ కిషన్ పక్కన ముందు కొత్తమ్మాయిని తీసుకుందాం అని అనుకున్నా, ఎవరూ సెట్ కాలేదు. తరువాత రీతు వర్మ కి కథని వినిపించారు, ఆమెకి కథ నచ్చి ఒప్పుకుంది అని అంటున్నారు. అలాగే రీతు వర్మ కి పారితోషికం కూడా బాగానే ముట్టచెపుతున్నారు అని ఒక వినికిడి వస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ నిన్ననే మొదలయ్యింది. మురళి శర్మ ఇంటి సెట్ లో ఈ చిత్రీకరణ మొదలయ్యింది, ఇందులో ప్రధాన పాత్రధారులు పాల్గొన్నారని తెలుస్తోంది. తండ్రి, కొడుకుల మధ్య జరిగే కథని వినోదాత్మకంగా ప్రసన్న రాస్తే, అది నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతోంది. (Rirtu Varma is playing the female lead opposite Sundeep Kishan)

rituvarmawithsundeepkishanb.jpg

ఇదిలా ఉండగా నక్కిన దర్శకత్వంలో వచ్చిన కథానాయికలు కూడా మంచి పేరు సంపాదించారు. శ్రీలీల, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ ఇలా అందరూ పనితో బిజీగా వున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో చెయ్యబోయే రీతు వర్మకి కూడా ఆ అదృష్టం కలిసి వస్తుందని అనుకుంటున్నారు.

Updated Date - Jun 20 , 2024 | 06:29 PM