Dhruva Natchathiram: విక్రమ్ ‘దృవ న‌క్ష‌త్రం’కు తప్పని పురిటి నొప్పులు.. మళ్లీ విడుదల వాయిదా?

ABN , First Publish Date - 2023-11-29T07:19:43+05:30 IST

క‌ర్ణుడి చావుకు వెయ్యి కార‌ణాలు అన్న‌ట్లుగా త‌యారైంది దృవ న‌క్ష‌త్రం సినిమా ప‌రిస్థితి. అప్పుడెప్పుడో 2013లో మొద‌లైన ఈ సినిమా ద‌శాబ్దం అయినా ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి గ‌ర్భం నుంచి శిశువు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు త‌ల్లి ప‌డే పురిటి నోప్పుల బాధ‌లు ప‌డుతున్న‌ది. మరి కొంత కాలం ఈ సినిమాకు తిప్ప‌లు త‌ప్పేలా లేవు.

Dhruva Natchathiram: విక్రమ్ ‘దృవ న‌క్ష‌త్రం’కు తప్పని పురిటి నొప్పులు.. మళ్లీ విడుదల వాయిదా?
Dhruva Natchathiram

క‌ర్ణుడి చావుకు వెయ్యి కార‌ణాలు అన్న‌ట్లుగా త‌యారైంది దృవ న‌క్ష‌త్రం (Dhruva Natchathiram) సినిమా ప‌రిస్థితి. అప్పుడెప్పుడో 2013లో మొద‌లైన ఈ సినిమా ద‌శాబ్దం అయినా ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి గ‌ర్భం నుంచి శిశువు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు త‌ల్లి ప‌డే పురిటి నోప్పుల బాధ‌లు ప‌డుతున్న‌ది. డైరెక్ట‌ర్ గౌత‌మ్ వాసుదేవ్ మీనన్(Gautham vasudev menon) ఏ మూముర్తానా ఈ సినిమా నిర్మాణం మోద‌లు పెట్టాడో గానీ ఓ అడుగు ముందుకేస్తే రెండడుగులు వెనక్కి అన్నట్లు తయారైంది పరిస్థితి. మరి కొంత కాలం ఈ సినిమాకు తిప్ప‌లు త‌ప్పేలా లేవు.

సూర్య సన్నాఫ్ కృష్ణన్ వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ 2013లో సూర్యా (Suriya)తో స్టార్ట్ చేసిన ఈ చిత్రాన్ని మొదలుపెట్టగా ఆ త‌ర్వాత వాళ్లిద‌రి మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డడంతో 2015లో జయం రవితో 2017లో విక్రమ్ (ChiyaanVikram)తో హీరోగా షూటింగ్ చేశారు. ఈ క్ర‌మంలో త్రిష, నయనతార, సమీరారెడ్డి, అసిన్, అమలాపాల్, అను ఇమ్మాన్యుయేల్ అంటూ అర డజన్ మంది కథానాయికలు మారుతూ చివరకి తెలుగమ్మాయి రీతూ వర్మ కన్ఫర్మ్ అయింది. హీరోహీరోయిన్లు మారినప్పుడల్లా మళ్లీ మళ్లీ రీ షూట్లు చేస్తూ అస‌లు సినిమా ఉంటుందా, వ‌స్తుందా అనే స్థాయికి ప‌రిస్థితులు వ‌చ్చాయి.

ఆ తర్వాత ఏఆర్ రెహమాన్ ఈ సినిమా నుంచి తప్పుకోగా హరీశ్ జయరాజ్(Harris Jayaraj ), ప్రతి నాయకుడిగా విక్రమన్ వచ్చి చేరగా, దాదాపు 7 దేశాల‌లో చిత్రీక‌ర‌ణ చేయాల్సి రావడంతో అంతకంతకు బడ్జెట్ పెరిగి ఫైనాన్షియల్ సమస్యలు తలెత్తి సినిమా పోస్ట్ పోన్ ప‌డుతూ వ‌చ్చింది. పైపెచ్చు క‌రోనా మొద‌ల‌వ‌డం, తీవ్ర‌ ఆర్థిక స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో సినిమా మ‌ళ్లీ సుధీర్ఘంగా వాయిదా ప‌డింది. ఆ సమస్యల నుంచి బయటకు వచ్చేందుకు నేను నటుడిగా మారానని, అక్కడి నుంచి వచ్చిన డబ్బుతో సినిమా షూటింగ్, ఇతర కార్యక్రమాలు చేశానంటూ దర్శకుడు గౌతమ్ మీనన్ ఓ ఇంటర్వ్యూలో తెలపడం గమనార్హం. చివరికి 2018లో ఓ టీజర్ విడుదల చేసినప్పటికీ సినిమా విడుదలకు మూడున్నర సంవత్సరాలు పట్టింది.


ఇదిలాఉండగా 2018లోనే సినిమా విడుదల ఉంటుందని చెబుతూ వచ్చిన యూనిట్ పోస్ట్ ప్రోడక్షన్ ఇష్యూతో వాయిదా పడింది. ఇక అప్పటినుంచి ప్రతి సంవత్సరం విడుదల తేదీలు చెబుతూ రావడం వాయిదా పడడం అనవాయితీగా మారింది. చివరగా 2023 దిపావళికి రిలీజ్ అవుతుందని చెప్పి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాక మరోసారి వాయిదా పడింది. సినిమా రిలీజుకు ముందే పైనాన్షియర్స్ రూ.8కోట్లు కోర్టులో డిపాజిట్ చేసి సినిమా విడుదల సజావుగా జరిగేలా చూడాలని గౌతమ్ వాసుదేవ్ మీనన్ కోరడంతో సినిమా మరోసారి వాయిదా పడింది. డిసెంబర్8న చిత్రం రిలీజ్ అవుతుందని ప్రకటించారు.

ఈ క్రమంలో చిత్ర దర్శకుడు, నిర్మాత గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham vasudev menon) తాజాగా సినీ అభిమానులకు క్షమాపణలు చెబుతూ ఎమోషనల్ అవుతూ ఓ లేఖ విడుదల చేశారు. సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నామని, ఎన్నో తీవ్ర అవాంతరాలను ఒక్కోక్కటిగా అధిగమిస్తూ వస్తున్నామని, త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ఇంతవరకు మాకు తోడ్పాటునందిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. ప్రేక్షకులు మాకు అమితమైన ప్రేమ, అప్యాయత అందిస్తున్నారని త్వరలోనే మిమ్మల్ని చేరుకుంటామని పేర్కోన్నాడు.

Updated Date - 2023-11-29T07:38:31+05:30 IST