మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Keerthi Suresh: గ్లామర్‌ పాత్రలకు కీర్తి సురేష్‌ సై?

ABN, Publish Date - May 26 , 2024 | 10:19 PM

సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోయిన్‌గా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేసుకున్న హీరోయిన్‌ కీర్తి సురేష్‌... ఇపుడు గ్లామర్‌ పాత్రల్లో నటించేందుకు సమ్మతించారనే ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ఆమె స్టార్‌ హీరోయిన్‌గా ఉన్నారు. అయితే, ఇటీవలే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్‌.. అక్కడ మాత్రం గ్లామర్‌ పాత్రల్లో నటించేందుకు సమ్మతం తెలిపారని బాలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

Keerthy Suresh

సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోయిన్‌గా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేసుకున్న హీరోయిన్‌ కీర్తి సురేష్‌ (Keerthi Suresh)... ఇపుడు గ్లామర్‌ పాత్రల్లో (Glamour Roles) నటించేందుకు సమ్మతించారనే ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ఆమె స్టార్‌ హీరోయిన్‌గా ఉన్నారు. అయితే, ఇటీవలే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్‌.. అక్కడ మాత్రం గ్లామర్‌ పాత్రల్లో నటించేందుకు సమ్మతం తెలిపారని బాలీవుడ్‌ (Bollywood) వర్గాలు పేర్కొంటున్నాయి.

*Mahesh-Namrata: ఈరోజు తల్లిదండ్రులుగా ఎంతో గర్వపడుతున్నాం.. మహేష్, నమ్రతల ఇన్‌స్టా పోస్ట్స్ వైరల్

గతంలో అట్లీ (Atlee) దర్శకత్వంలో విజయ్‌ (Vijay), సమంత (Samantha), అమీ జాక్సన్‌ (Amy Jackson)లు నటించిన తమిళ చిత్రం ‘థెరి’ (Theri)ని హిందీలోకి ‘బేబీ జాన్‌’ (Baby John) పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. వరుణ్‌ ధావన్‌, వామికా కఫీ, జాకీష్రా‌ఫ్‌లతో పాటు అనేక మంది నటిస్తున్నారు. వాస్తవానికి బాలీవుడ్‌లో గ్లామర్‌, ఎక్స్‌పోజింగ్‌, ముద్దు సన్నివేశాల్లో నటించేందుకు సమ్మతించేవారికి మాత్రమే అవకాశాలు లభిస్తాయన్న విషయం తెలిసిందే. ఆ కోణంలో చూస్తే కీర్తి సురేష్‌ కూడా వీటికి అంగీకరించడం వల్లే బాలీవుడ్‌ ఛాన్స్‌ వరించిందన్న ప్రచారం జరుగుతుంది.


ఎందుకంటే, సౌత్‌లో ఆమె చేసిన సినిమాలన్నింటిలోనూ ఎంతో పద్ధతిగా కనిపించిన కీర్తి సురేష్.. ‘మహానటి’ (Mahanati) సినిమాతో ఎక్కడాలేని స్టార్‌డమ్‌ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత సోలోగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ.. ఏవీ కూడా సరైన విజయం సాధించలేదు. దీంతో బాడీపై కాస్త శ్రద్ధ పెట్టిన కీర్తి.. స్లిమ్‌గా తయారైంది. మహేష్‌తో ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata)లో సందడి చేసిన కీర్తి.. అప్పుడే గ్లామర్ పాత్రలకు సై అన్నట్లుగా హింట్ ఇచ్చింది. దీంతో ఆమెకు బాలీవుడ్ అవకాశం వరించడం.. ఆ సినిమా షూటింగ్‌లో మరింత గ్లామర్‌గా కనిపించడంతో.. కీర్తిపై ఇలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయి.

Read Latest Cinema News

Updated Date - May 26 , 2024 | 10:19 PM