Viswam X Review: శ్రీను వైట్ల, గోపిచంద్ విశ్వం ఎలా ఉందంటే.. ట్విట్టర్ రివ్యూ

ABN, Publish Date - Oct 11 , 2024 | 06:53 AM

మాచో స్టార్ గోపీచంద్ (Gopichand), దర్శకుడు శ్రీను వైట్ల (Srinu vaitla) ఫస్ట్ కొలాబరేషన్ లో తెరకెక్కించిన మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. ఈ రోజు (శుక్రవారం అక్టోబర్ 11)న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి నెటిజ‌న్లు ఏవిధంగా స్పందిస్తున్నారంటే.

Viswam poster

మాచో స్టార్ గోపీచంద్ (Gopichand), దర్శకుడు శ్రీను వైట్ల (Srinu vaitla) ఫస్ట్ కొలాబరేషన్ లో తెరకెక్కించిన మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటించింది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మించారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. దసరా కానుకగా ఈ సినిమా నేడు (శుక్రవారం) గ్రాండ్ రీలీజ్ అయ్యింది. మ‌రి ఈ సినిమా చూసిన వాళ్లు త‌మ ఫీలింగ్‌ను త‌మ త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్ల ద్వారా తెలియ జేస్తున్నారు. మ‌రి వారి అభిప్రాయాలు ఉలా ఉన్నాయంటే


సినిమా విడుద‌లైన ప్ర‌తి చోట నుంచి మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తుంది. మూవీలో శ్రీను వైట్ల మార్క్ కామెడీ కొంచెం అవుట్ డేటెడ్‌గా అనిపించిందంటున్నారు కొందరు. యాక్టర్ పృద్వి ఉన్నంత వరకు ఫస్ట్ హాఫ్‌లో కామెడీ పండింది. కానీ.. ఇతర కామెడీ ట్రాక్స్ వర్క్ అవుట్ కాలేదు. గోపీచంద్, కావ్య మధ్య కూడా కెమిస్ట్రీ పెద్దగా కుదిరినట్లు అనిపించలేదు. అయితే ఎప్పటిలాగానే శ్రీను వైట్ల ట్రైన్ ట్రాక్ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించింది. 30 నిమిషాల నిడివిలో ఉన్న సీన్ సినిమాకే హైలెట్ అంటున్నారు. మరోవైపు కొన్ని యాక్షన్ సీన్స్ అయితే బోయపాటి శ్రీను సినిమాలకి మించి ఉన్నట్లు తెలుస్తోంది. హీరో గోపిచంద్ మాచో‌నెస్‌కి యాక్షన్ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యిందంటున్నారు. రీసెంట్ టైమ్స్‌లో గోపీచంద్, శ్రీను వైట్ల మూవీస్‌లో ఈ మూవీనే బెస్ట్ అంటున్నారు. మరికొందరు అయితే ఏకంగా 'వింటేజ్ శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్' అంటున్నారు.

Also Read- Vettaiyan Review: రజనీకాంత్ నటించిన యాక్షన్ మూవీ ‘వేట్ట‌య‌న్... ది హంట‌ర్‌’ ఎలా ఉందంటే.. 

Updated Date - Oct 11 , 2024 | 06:53 AM