Uruku Patela Review: తేజస్ కంచర్ల నటించిన 'ఉరుకు పటేలా' సినిమా ఎలా ఉందంటే

ABN, Publish Date - Sep 07 , 2024 | 05:36 PM

'ఉలవచారు బిర్యానీ’తో కథానాయకుడిగా పరిచయమయ్యారు తేజస్‌ కంచర్ల (Tejas Kancharla). తదుపరి 'హుషారు' చిత్రంతో విజయం అందుకున్నారు. పాయల్‌ రాజ్‌పుత్‌లో 'ఆర్‌డిఎక్స్‌ లవ్‌' చిత్రం చేశారు. అది అంతగా ఆకట్టుకోలేదు. తాజాగా ఆయన ‘ఉరుకు పటేల’ అంటూ వినాయక చవితి సందర్భంగా థియేటర్స్‌లోకి వచ్చారు.

సినిమా రివ్యూ: ఉరుకు పటేలా (Uruku Patela Review)
విడుదల తేది: 7–9–2024
నటీనటులు: తేజాస్‌ కంచర్ల. ఖుష్బూ చౌదరి, గోపరాజు రమణ, సుదర్శన్‌, చమ్మక్‌ చంద్ర తదితరులు


సాంకేతిక నిపుణులు:

సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి
సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు
నిర్మాతలు: కంచర్ల బాల భాను,  లీడ్‌ ఎడ్జ్‌ పిక్చర్స్‌
దర్శకత్వం: వివేక్‌ రెడ్డి. (Vivek Reddy)


'ఉలవచారు బిర్యానీ’తో కథానాయకుడిగా పరిచయమయ్యారు తేజస్‌ కంచర్ల (Tejas Kancharla). తదుపరి 'హుషారు' చిత్రంతో విజయం అందుకున్నారు. పాయల్‌ రాజ్‌పుత్‌లో 'ఆర్‌డిఎక్స్‌ లవ్‌' చిత్రం చేశారు. అది అంతగా ఆకట్టుకోలేదు. తాజాగా ఆయన ‘ఉరుకు పటేల’ అంటూ వినాయక చవితి సందర్భంగా థియేటర్స్‌లోకి వచ్చారు. ‘గెట్‌ ఉరికిఫైడ్‌’ అన్నది సినిమా ట్యాగ్‌ లైన్‌. లీడ్‌ ఎడ్జ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై వివేక్‌ రెడ్డి దర్శకత్వంలో కంచర్ల బాల భాను నిర్మించారు.  ఈ చిత్రంలో ఎలా ఉందో చూద్దాం. (Uruku Patela Review)

కథ
గ్రామ సర్పంచ్‌ రామరాజు (గోపరాజు రమణ) కుమారుడు పటేల (తేజస్‌ కంచర్ల). తన తండ్రిని ఎవరైనా చిన్న మాట అన్నా సహించదు. ఏడో తరగతితో చదుపు ఆపేసిన పటాలాకు ఊర్లోనే కాదు, పక్క ఊరి వాళ్లు కూడా అమ్మాయిని ఇవ్వరు. తనకు మాత్రం బాగా చదువుకున్న అమ్మాయిని పెళ్లాడాలని కోరిక. ఓ స్నేహితుడి పెళ్లిలో డాక్టర్‌ అక్షర (ఖుష్బూ చౌదరి) పరిచయమవుతుంది. పరిచయం స్నేహంగా మారాక, ఓ ప్రమాదం నుంచి ఆమెను కాపాడతాడు పటేల.. అప్పటి నుంచి అతని ప్రేమలో పడుతుంది అక్షర. అసలు చదువులేని అబ్బాయిని డాక్టర్‌ వృత్తిలో ఉన్న ఆమె ప్రేమలో పడటానికి, పెళ్లి చేసుకుంటాను అనడానికి కారణమేంటి? అక్షర పుట్టినరోజున విష్‌ చేయడానికి వెళ్లిన పటేలాకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. అక్షర కుటుంబాన్ని చూసి పటేల  భయపడటానికి కారణమేంటి అన్నది మిగతా కథ.  (Uruku Patela Review)



విశ్లేషణ:
తెలంగాణలోని ఓ పల్లెలో సాగే సింపుల్‌ లవ్‌, థ్రిల్లర్‌ ఇది. సర్పంచ్‌ అయిన తండ్రి వెనుక తిరుగుతూ సరదాగా లైఫ్‌ సాగించే ఓ కుర్రాడి కథ. ప్రేమించి, పెళ్లి చేసుకుంటానన్న ఓ యువతి అతన్ని ఎందుకు చంపాలనుకుంటుంది అన్నది  ట్విస్ట్‌. పథమార్ధం అంతా  స్నేహితులు, లవ్‌, కామెడీతో ఫస్టాప్‌ సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్‌ దగ్గర అసలు కథేంటి అన్నది రివీల్‌ అవుతుంది. నరబలి, వేరొక వ్యక్తి రక్తంతో తడిపితే అనారోగ్యంతో ఉన్న మనిషి లేచి నిలబడతారు అన్న మూఢనమ్మకాలు, వాటి ప్రభావం మనిషిపై ఎలా ఉంటుందనేది చెప్పారు. ఫస్టాఫ్‌ ఫన్‌గా సాగినా చాలా సినిమాల్లో చూసిన భావనే కలుగుతుంది. ఇదే కథను కామెడీ థ్రిల్లర్‌లా కాకుండా పూర్తిగా థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కించి ఉంటే ఇంపాక్ట్‌ బావుండేది. అయితే దర్శకుడు వివేక్‌ థ్రిల్లింగ్‌ అంశాలతోపాటు చక్కని ప్రేమ కథ, కామెడీని కూడా అందించాలనుకునే ప్రయత్నం చేశారు. సెకెండాఫ్‌ ట్విస్ట్‌ బావుంది. కాకపోతే ఆసుపత్రి సన్నివేశం లెంగ్త్‌ ఎక్కువ లేకుండా చూసుకుంటే బావుండేది. ఇంటర్వెల్‌ ముందు ట్విస్ట్‌, క్లైమాక్స్‌ ముందు మరొక ట్విస్ట్‌... ఆ  రెండింటి ఆధారంగా దర్శకుడు కథ నడిపించారు. ట్విస్ట్‌లు బాగానే ఉన్న వాటికి మధ్యలో ఉన్న సన్నివేశాలు రక్తికట్టించలేదు. (Uruku Patela Review)

ఇక ఆర్టిస్ట్‌ల విషయానికొస్తే.. పటేలగా తేజస్‌ కంచర్ల పర్ఫెక్ట్‌గా యాప్ట్‌ అయ్యారు. సినిమా సినిమాకు షైన్‌ అవుతూ ఈ చిత్రంలో చక్కని నటన కనబర్చారు. తనలో ఈజ్‌, ఎనర్జీ తెరపై అలరించింది. డాన్స్‌లతో కూడా అలరించాడు. కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన ఖుష్బూ చౌదరి అందం, అభినయంతో ఆకట్టుకుంది. గోపరాజు రమణ క్యారెక్టర్‌ ఓకే అనిపించింది. ఆనంద చక్రపాణి ఈ మధ్యన చేసిని పాత్రల్లో లుక్‌ పరంగా కొత్తగా ఉన్న పాత్ర చేశారు. సుదర్శన్‌ అక్కడక్కడా నవ్వించాడు. ‘చమ్మక్‌’ చంద్ర కామెడీ తేలిపోయింది. కొంత గ్యాప్‌ తర్వాత  ప్రవీణ్‌ లక్కరాజు చక్కని బాణీలు అందించారు. ఆర్‌ఆర్‌ కూడా బావుంది. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. ఎడిటింగ్‌ ఓకే, నిర్మాతలు ఎక్కడా తగ్గకుండా క్వాలిటీగా సినిమా తీశారు. ఇందులో ప్రేమకథ, తండ్రీ కొడుకుల మధ్య ప్రేమ, భావోద్వేగాలు, ట్విస్ట్స్‌, కామెడీ.. అన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి. దర్శకుడు నటీనటుల ఎంపిక బావుంది. కానీ కొన్ని సన్నివేశాల రాత, తీత విషయంలో అనుభవలేమి కనిపించింది. సినిమాలో రెండు ట్విస్ట్‌లకు ఽమధ్య బోర్‌ ఫీల్‌ అవుతున్న సమయంలో తన నటనతో తేజస్‌ కంచర్ల నిలబెట్టే ప్రయత్నం చేశారు.  

ట్యాగ్‌లైన్‌: ఉరికించాలి పటేలా..!


Updated Date - Sep 07 , 2024 | 06:30 PM