Narudi Brathuku Natana: ‘నరుడి బ్రతుకు నటన’ ఎలా ఉందంటే..

ABN, Publish Date - Oct 26 , 2024 | 12:31 AM

యువ నటుడు శివకుమార్‌ తెలుగుతెరపై పాజిటివ్‌ పాత్రలతోపాటు, నెగటివ్‌ రోల్స్‌ చేస్తు అలరిస్తున్నారు. మలయాళ నటుడు నితిన్‌ ప్రసన్నతో కలిసి ఆయన నటించిన చిత్రం '‘నరుడి బ్రతుకు నటన’’.

సినిమా రివ్యూ: ‘నరుడి బ్రతుకు నటన’ (Narudi Brathuku natana)
విడుదల తేది: 25–10–2024
నటీనటులు: శివ కుమా(Siva kumar) రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, (nithin kumar)శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వివా రాఘవ్, దయానంద్ రెడ్డి, తదితరులు.


సాంకేతిక నిపుణులు:

సినిమాటోగ్రాఫర్: ఫహద్ అబ్దుల్ మజీద్

సంగీత దర్శకుడు: NYX లోపెజ్

నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి

రచయిత - ఎడిటర్ - దర్శకుడు: రిషికేశ్వర్ యోగి


యువ నటుడు శివకుమార్‌ తెలుగుతెరపై పాజిటివ్‌ పాత్రలతోపాటు, నెగటివ్‌ రోల్స్‌ చేస్తు అలరిస్తున్నారు. మలయాళ నటుడు నితిన్‌ ప్రసన్నతో కలిసి ఆయన నటించిన చిత్రం '‘నరుడి బ్రతుకు నటన’’. రిషికేశ్వర్‌ యోగి దర్శకత్వం వహించారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్‌, ఎస్‌ స్క్వేర్  సినిమాస్‌, సీ ఫర్‌ యాపిల్‌ ప్రొడక్షన్స్‌ పతాకాలపై సుకుమార్‌ బోరెడ్డి, డాక్టర్‌ సింధూరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ: Narudi Brathuku Natana

హీరోగా రాణించడం కోసం కష్టపడుతుంటాడు సత్య (శివకుమార్‌). కానీ ప్రతి చోట తిరస్కరించబడతాడు. చాలా మంది అతనికి యాక్టింగ్‌ రాదని అవమానిస్తారు. ఇంట్లో తండ్రి (దయానంద్‌ రెడ్డి) కూడా సత్యకు యాక్టింగ్‌ రాదని అవమానిస్తాడు. ఓ ఆడిషన్‌కి వెళ్తే అక్కడ కూడా అదే అవమానం ఎదరవుతుంది. చివరకు ఫ్రెండ్‌ జ్ఞానోదయం చేస్తాడు. దాంతో ఫ్రస్ట్రేషన్‌లో ఓ యాక్సిడెంట్‌ చేసినప్పుడు ఫ్రెండ్‌ అసలు విషయం చెబుతాడు. యాక్టింగ్‌ రావాలంటే కష్టం విలువ తెలియాలి. సమాజంలోని ప్రతి ఒక్క ఎమోషన్స్‌ తెలియదని, అవన్నీ అనుభవిస్తేనే వస్తాయని చెబుతాడు. దీంతో సమాజం, అందులో మనుషులు ఎలా ఉంటారో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఓ జర్నీ చేస్తాడు. కేరళాకి వెళ్తాడు. అక్కడ తెలుగు తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి డీ సల్మాన్‌(నితిన్‌ ప్రసన్న) పరిచయం అవుతాడు. ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. అసలు మనుషులు, వారి మధ్య ఎమోషన్స్‌, బాధల్ని అక్కడ చూస్తాడు. అక్కడ కొత్త పరిచయాలు, ఓ ట్విస్ట్‌. తాను కేరళాలో ఏం తెలుసుకున్నాడు. సల్మాన్‌ నేర్పించిన జీవిత పాఠం ఏంటి? అన్నది కథ.

విశ్లేషణ:
సినిమా హీరో కావాలనుకున్న ఓ కుర్రాడి కథ ఇది. సినిమా ఇండస్ట్రీలో సూపర్‌ స్టార్‌గా ఎదిగిన ప్రతి ఒక్క తన జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, బాధలు చూసినవాళ్లే. జీవితంలో స్ట్రగుల్స్‌ లేకుండా ఎదిగిన ఒక్క లెజెండ్‌ యాక్టర్స్‌ని చూపించమని సినిమాలో డైలాగ్‌ ఉంటుంది. ఏ స్థాయిలో ఉన్న నటుడు అయినా కెమెరా ముందు ఆయా బావోద్వేగాలు పలికించాలంటే అవి నిజ జీవితంలో అతను అనుభవించి తీరాలి. అప్పుడే బెస్ట్‌ యాక్టింగ్‌ బయటకు వస్తుందనేది, వాళ్లే నిజమైన యాక్టర్స్‌ అని ఈ సినిమా అంతర్లీనంగా చెప్పిన అంశం. నటుడు కావాలనుకున్న ఓ వ్యక్తి అసలు జీవితాన్ని చూపించిన సినిమా ఇది. ఫస్టాఫ్‌ సీరియస్‌గా, కాస్త స్లోగా సాగుతుంది. కేరళాకి కథ షిఫ్ట్‌ అయ్యాక, డీ సల్మాన్‌ పాత్ర ఎంట్రీతో ఫన్నీగా మారింది. సత్య పాత్రలోని ఎమోషన్స్‌ కనెక్ట్‌ చేసే క్రమంలో, ఆ పాత్ర తీరుతెన్నులను ఎస్టాబ్లిష్‌ చేసే క్రమంలో కొంత టైమ్‌ తీసుకున్నారు. అయితే సెకెండాఫ్‌లో వేగం పుంజుకుని ఎమోషనల్‌ రోల్‌ కోస్టర్‌లా ఉంటుంది. చక్కని ఫన్‌ పంచింది. పక్కింటి గర్భిణి పాడే పాట దాన్ని సత్య పొందే అనుభూతి ఫీల్‌ గుడ్‌గా మారుస్తుంది. అయితే డీ సల్మాన్‌ పాత్ర లవ్‌ ఫెయిల్యూర్‌ ఎపిసోడ్‌ కడుపుబ్బా నవ్విస్తుంది.  క్లైమాక్స్‌ మాత్రం ఫీల్‌గుడ్‌గా ముగుస్తుంది. హీరో పాత్రలోని చిన్న ట్విస్ట్‌ సర్ర్పైజ్‌ చేస్తుంది. ఫైనల్‌గా మరింత ఎమోషనల్‌గా సాగుతుంది. అయితే సినిమాలో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేకపోవడం మైనస్‌ అనుకోవచ్చు.  

ఫస్టాఫ్‌ పై ఇంకాస్త వర్క్‌ చేసి ఉంటే ఇంకాస్త కిక్‌ తగ్గింది. ఫీల్‌గుడ్‌ సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోర్‌ కొట్టవు.  ఇది కూడా అలాంటి చిత్రమే! పలు చిత్రాలు సెకెండ్‌ లీడ్‌గా, ఫ్రెండ్‌గా నటించిన శివకుమార్‌ సత్యగా నటించాడు. బాయ్‌ నెక్ట్స్‌స డోర్‌ అన్నట్లుగా, మనలో ఒకడు అన్నట్లు నటించాడు.  నితిన్‌ ప్రసన్న చేసిన పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలిచింది. అతని పాత్ర చాలా విషయాలు నేర్పిస్తుంది. హీరో తండ్రి పాత్రలో దయానంద్‌ రెడ్డి ఆకట్టుకున్నారు. గర్భిణిగా, సత్య ఇష్టపడే అమ్మాయిగా శృతి జయన్‌ ఉన్నంతలో బాగా చేసింది. ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ చాలా బావున్నాయి. హీరో ఫ్రెండ్‌గా వైవా రాఘవ మరోసారి తనకు యాప్ట్‌ అయిన పాత్రలో మెప్పించారు. మిగతా ఆర్టిస్ట్‌లు ఫర్వాలేదనిపించారు. కెమెరా పనితనం చక్కగా కుదిరింది. కేరళ అందాలను మరింత అందంగా చూపించారు. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ కూడా సినిమాకు తగ్గట్లే ఉంది. నిర్మాణ విలువలు బావున్నాయి. దర్శకుడు రిషికేశ్వర్‌ చక్కని పాయింట్‌ తీసుకున్నాడు. అంతే చక్కగా తెరపై చూపించారు. కమర్షియల్‌ అంశాల సంగతి పక్కన పెడితే.. కాస్త ఫేమ్‌ ఉన్న యాక్టర్స్‌ని పెట్టుకుని మూవీ జనాల్లోకి బాగా వెళ్లేది. డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. ఫస్టాఫ్‌, సెకెండాఫ్‌లో కాస్త కత్తెర వేయాల్సిన సన్నివేశాలు ఉన్నాయి. ఓవరాల్‌గా చూస్తే  చక్కని ఫీల్‌గుడ్‌ సినిమాగా చెప్పొచ్చు.

ట్యాగ్‌లైన్‌: ఫీల్‌ గుడ్‌ మూవీ

Updated Date - Oct 26 , 2024 | 09:41 AM