Saripodhaa Sanivaaram X Review: నాని ‘సరిపోదా శనివారం’ ఎలా ఉందంటే! ట్విట్టర్ రివ్యూ
ABN, Publish Date - Aug 29 , 2024 | 06:08 AM
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషనల్‌లో రెండో చిత్రంగా తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినీ ప్రియులు ఇప్పటికే సినిమాను చూసి సోషల్ మీడియా ద్వరా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరి వారు ఎలా స్పందించారంటే..
నేచురల్ స్టార్ నాని (Nani), డైరెక్టర్ వివేక్ ఆత్రేయ (Vivek Athreya) కాంబినేషనల్‌లో రెండో చిత్రంగా తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా రిలీజ్‌కు ముందే వచ్చిన పోస్టర్లు, గ్లింప్సెస్, సాంగ్స్ ప్రతిది మూవీపై హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేశాయి. బుధవారం నుంచే ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ పడడం, బయటి దేశాల్లో విడుదలవడం కూడా జరిగిపోయాయి. దీంతో సినీ ప్రియులు ఇప్పటికే సినిమాను చూసి సోషల్ మీడియా ద్వరా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరి వారు ఎలా స్పందించారంటే..
సినిమా ప్రారంభమే డైరెక్ట్ ఇన్వాల్ అయ్యేలా చేసిందని, నాని ఇంట్రో అదుర్స్ అనేలా ఉందని, రెగ్యులర్ ఫార్మాట్ కథే అయినా దర్శకుడు తీసుకున్న శనివారం కాన్సెప్ట్ అదిరిపోయిందని అంటున్నారు. ముఖ్యంగా జేక్స్ బిజాయ్ సంగీతం మూవీని ఎక్కడికో తీసుకెళ్లిందని, అతని నుంచి ఈ రేంజ్ మ్యూజిక్ ఊహించలేదని కుడోస్ జేక్స్ అంటూ ట్వీట్ చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ సూపర్‌గా ఉన్నాయని, మెయిన్ క్యారెక్టర్స్ పాత్రలో జీవించారని, ముఖ్యంగా సూర్య, నానిల మధ్య సీన్లు ఎక్సలెంట్‌గా కుదిరాయని, ఒకటి రెండు సన్నివేశాల్లో నానిని మించేలా సూర్య డామినేషన్ కనిపిస్తుందని, ప్రియాంకా మోహాన్ ( Priyanka Mohan) అందంగా, అమాయకంగా ఆకట్టుకుంటుందని పోస్టులు పెడుతున్నారు.
పాటలతో పాటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈమధ్య ఇతర చిత్రాలలో రాని విధంగా ఉందని గూస్ బంప్స్ తెచ్చేలా ఉందని, ఫస్ట్ టైం నాని సినిమాను విజిల్స్ మధ్య చూసినట్లు, ఇంటర్వెల్ బ్యాంగ్ దుమ్మలేపుతుందని అంటున్నారు. అయితే క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్ అనుకున్నంత హై ఇవ్వలేదని, ఎమోషల్ సీన్లు ఆకట్టుకునేలా లేవని, కొన్నీ సీన్లు రిపీట్ అనిపించాయని కానీ మస్ట్ వాచ్ మూవీ అంటూ రాసుకోస్తున్నారు. మొత్తానికి దర్శకుడు వివేక్ ఆత్రేయ రైటింగ్, నాని, సూర్యల యాక్టింగ్ మనకు కఎక్ట్రార్డనరీ ఫీల్ ఇస్తుందని చాలామంది సినిమా చూసిన వారు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.