Love Reddy Review: ప్రేమకు మరణం లేదంటూ సాగే లవ్ రెడ్డి ఎలా ఉందంటే 

ABN, Publish Date - Oct 18 , 2024 | 06:47 PM

అంజన్‌ రామచంద్ర, శ్రావణి రెడ్డి జంటగా లవ్‌స్టోరీతో తెరకెక్కిన చిత్రం 'లవ్‌రెడ్డి’. యంగ్‌ డైరెక్టర్‌ స్మరన్‌ రెడి దర్శకత్వం వహించారు. నందమూరి బాలకృష్ణ ఈ చిత్రం గ్లింప్స్‌ విడుదల చేయడంతో సినిమాకు హైప్‌ వచ్చింది.

love reddy

సినిమా రివ్యూ: లవ్‌రెడ్డి (Love Reddy Review)


విడుదల తేది: 18–10–2024
నటీనటులు: అంజన్‌ రామచంద్ర, శ్రావణి రెడ్డి, జ్యోతి మదన్‌, గణేశ్‌, పల్లవి, యన్‌.టి. రామస్వామి,  రవి కాలబ్రహ్మ, వాణి గౌడ తదితరులు


సాంకేతిక నిపుణలు

సినిమాటోగ్రఫీ: కె.శివ శంకర వర ప్రసాద్, మోహన్ చారి, అష్కర్ అలీ
సంగీతం: ప్రిన్స్‌ హేన్రి
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాతలు సునంద రెడ్డి, నాగరాజు బీరప్ప, ప్రభంజన్‌ రెడ్డి, నవీన్‌ రెడ్డి హేమలత, రవీందర్‌, మదన్‌ గోపాల్‌ రెడ్డి.
రచన–దర్శకత్వం: స్మరణ్‌ రెడ్డి (Smaran Reddy)


అంజన్‌ రామచంద్ర, శ్రావణి రెడ్డి జంటగా లవ్‌స్టోరీతో తెరకెక్కిన చిత్రం 'లవ్‌రెడ్డి’. యంగ్‌ డైరెక్టర్‌ స్మరన్‌ రెడి దర్శకత్వం వహించారు. నందమూరి బాలకృష్ణ ఈ చిత్రం గ్లింప్స్‌ విడుదల చేయడంతో సినిమాకు హైప్‌ వచ్చింది. ఇప్పటికే విడుదల టీజర్లు, ట్రైలర్లు అలరించాయి. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ లవ్‌రెడ్డి ప్రేక్షకుల్ని ప్రేమలో పడేశాడా? లేదా అన్నది రివ్యూలో చూద్దాం.


కథ: (Love reddy Story)


నారాయణ రెడ్డ్డి(అంజన్‌ రామచంద్ర)కి 30 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాదు. కుటుంబ సభ్యులు ఎన్ని సంబంధాలు చూసినా ఏదో ఒక కారణంతో తిరస్కరిస్తుంటాడు. ఓ సందర్భంలో బస్‌లో దివ్య(శ్రావణి)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అప్పటి నుంచి లవ్‌రెచి?్డగా మారి ఆ అమ్మాయే లోకంగా బతుకుతాడు. దివ్య కూడా నారాయణ రెడ్డితో ేస్నహం చేస్తుంది. ప్రేమ విషయాన్ని చెప్పకుండానే ఇద్దరు బాగా క్లోజ్‌ అవుతారు. ఓ రోజు ధైర్యం చేసి నారాయణ తన ప్రేమ విషయాన్ని ఆ అమ్మాయితో చెబుతాడు. దివ్య మాత్రం అతని ప్రపోజల్‌ని రిజెక్ట్‌ చేస్తుంది. ప్రాణంతో సమానంగా ప్రేమించిన నారాయణకు దివ్య నో ఎందుకు చెప్పింది? దివ్య పరిచయం వల్ల అతని లైఫ్‌ ఎలాంటి మలుపు తీసుకుని ఎక్కడికి చేరిందనేది కథ.



విశ్లేషణ..


‘మరణం మనుషులకే కానీ మనసులకి కాదు.. ఈ ప్రపంచంలో పూడ్చిపెట్టలేనిది, పూడ్చినా సజీవంగా ఉండేది ‘ప్రేమ’ ఒక్కటే’ అనే  ఇతివృత్తంతో  సాగే కథ ఇది. పెళ్లి చూపులు సీన్‌తో సినిమా మొదలవుతుంది. ఎన్ని సంబంధాలు చూసినా నచ్చలేదనే కారణంలో తిరస్కరించిన యువకుడు లవ్‌రెడ్డిగా మారిన తర్వాత కథ మలుపు తిరుగుతుంది. కథనం ఆసక్తికరంగా సాగుతుంది. అయితే అంతకుముందు తన ప్రేమను వ్యక్తం చేయడానికి హీరో చేేస ప్రయత్నాలు రొటీన్‌గా, సాగదీతగా అనిపించాయి. స్వీటీ సీన్లు కొంతవరకు వినోదాన్ని పంచుతాయి. నారాయణ రెడ్డిని దివ్య ప్రేమిస్తుందా లేదా? అనే విషయాన్ని సెకండాఫ్‌ వరకు రివీల్‌ చేయకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచిన సందర్భాలు ఆసక్తిగా ఉన్నాయి.  సున్నితమైన ప్రేమకథను సహజంగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. వినోదాత్మకంగా కథను మొదలుపెట్టి, చివర్లో గుండె బరువెక్కేలా చేశాడు. అయితే ప్రాణంతో సమానంగా భావించిన అమ్మాయితో ప్రేమ సన్నివేశాలను కాస్త లోతుగా చెప్పుంటే ఇంకాస్త ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేది. ఫస్టాఫ్‌ సోసోగా సాగినా సెకెండాఫ్‌ మాత్రం ఆసక్తిగా సాగింది.

ఈ సినిమాలో అంతా కొత్త వాళ్లే చక్కగా నటించారు. భగ్నప్రేమికుడు నారాయణరెడ్డి క్యారెక్టర్‌లో అంజన్‌ రామచంద్ర ఒదిగిపోయాడు. దివ్య పాత్రకు శ్రావణి న్యాయం చేసింది. దివ్య తన బాయ్‌ ఫ్రెండ్‌ ప్రేమను రిజెక్ట్‌ చేయడానికి గల కారణం తెలిసిన తర్వాత ప్రేక్షకుడు ఎమోషనల్‌ అవుతాడు. ఆమె పాత్రకు  నేటితరం అమ్మాయిలు బాగా కనెక్ట్‌ అవుతారు. హీరోయిన్‌ తండ్రి పాత్రధారి సినిమాకు ఓ పిల్లర్‌ అనొచ్చు. క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. స్వీటీగా జ్యోతి మదన్‌ అక్కడక్కడా నవ్వించారు. మిగిలిన పాత్రధారులు తమ పరిధి మేరకు యాక్ట్‌ చేశారు. టెక్నికల్‌గా సినిమా బావుంది.

పిన్స్‌ హేన్రి సంగీత సినిమాకు ఎసెట్‌. నేపథ్య సంగీతంతో ప్రాణం పోశారు. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది.  ఇలాంటి ప్రేమకథలు క్రిస్ప్‌గా ఉంటేనే బావుంటుంది. ఎడిటర్‌ ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు తెరపై కనిపిస్తున్నాయి. చివరి 20 నిమిషాలు పూర్తి భావోద్వేగాలతో సాగుతుంది. పతాక సన్నివేశాలు గుండెను బరువెక్కిస్తాయి. అయితే ఇది కొత్త ప్రేమ కథ కాదు.. క్లైమాక్స్‌ కొత్తగా లేదు. ప్రేమ, రిజెక్షన్‌ గురించి తెలిసిన నేపథ్యం భావోద్వేగానికి లోను చేస్తుంది. ప్రథమార్ధం కాస్త బలంగా ఉంటుండే దర్శకుడికి ఇంకాస్త మంచి పేరు రావడానికి అవకాశం ఉండేది. ఇదే కథను పేరున్న ఆర్టిస్ట్‌లతో తీసుంటే రీచ్‌ ఇంకా బావుండేది. అంతా కొత్తవారు కాబట్టి ఈ ప్రేమకథ ప్రేక్షకులకు ఏ మేరకు రీచ్‌ అవుతుందో చూడాలి. పరువు, ప్రతిష్ఠ, ప్రేమ అంటూ సున్నితమైన లైన్‌ను టచ్‌ చేసిన దర్శకుడిని అభినందించవచ్చు.

ట్యాగ్‌లైన్‌: మరణం లేని ప్రేమ.. రొటీన్ బట్ మ్యాటర్ ఉంది

Updated Date - Oct 19 , 2024 | 02:46 PM