The Substance: మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఎలా తీశార్ర బాబు ఈ సినిమా! స్ట్రీమింగ్ ఎక్క‌డ అంటే

ABN, Publish Date - Oct 20 , 2024 | 04:48 PM

ఇటీవ‌ల ఓటీటీలో సోష‌ల్ మీడియా, యూ ట్యూబ్‌ల్లో వీప‌రీతంగా విశ్లేష‌ణ‌లు, రివ్యూల‌తో తెగ ర‌చ్చ చేస్తొన్న హాలీవుడ్‌ చిత్రం ది స‌బ్‌స్టాన్స్. సెప్టెంబ‌ర్‌లో అమెరికా, లండ‌న్‌ల‌లో థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ మూవీ ఇటీవ‌లే ఓటీటీకి వ‌చ్చింది. కానీ..

the substance

ఇటీవ‌ల ఓటీటీలో సోష‌ల్ మీడియా, యూ ట్యూబ్‌ల్లో వీప‌రీతంగా విశ్లేష‌ణ‌లు, రివ్యూల‌తో తెగ ర‌చ్చ చేస్తొన్న హాలీవుడ్‌ చిత్రం ది స‌బ్‌స్టాన్స్ (The Substance). సెప్టెంబ‌ర్‌లో అమెరికా, లండ‌న్‌ల‌లో థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించి పెట్టిన పెట్టుబ‌డికి రెండింత‌లు లాభం సంపాదించి పెట్టింది. 2017లో రివేంజ్ అనే ఓ బోల్డ్ యాక్ష‌న్ సినిమాను రూపొందించిన ఫ్రాన్స్‌కు చెందిన‌ లేడీ డైరెక్ట‌ర్‌ కోరలీ ఫార్గేట్ (Coralie Fargeat) ఈ సినిమాకు ద‌ర్శ‌కత్వం వ‌హించ‌డంతో పాటు, ర‌చ‌యిత‌గా, నిర్మాత‌గా, ఎడిట‌ర్‌గా మ‌ల్టీపుల్ శాఖ‌ల‌ను నిర్వ‌హించ‌డం విశేషం. న‌వంబ‌ర్‌లో ఈ సినిమా ఫ్రాన్స్‌లో రిలీజ్‌కు సిద్ధం అవుతుండ‌గా తాజాగా ఈ సినిమా ఇటీవ‌లే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు కూడా వ‌చ్చేసింది. అల‌నాటి స్టార్ హీరోయిన్ డెమీ మూర్ (Demi Moore), ప్ర‌స్తుతం కుర్ర‌కారు హ‌ర్ట్‌త్రోబ్ మార్గరెట్ క్వాలీ (Margaret Qualley) మెయిన్ లీడ్స్‌గా న‌టించారు.

క‌థ‌ విష‌యానికి వ‌స్తే.. ఓ మ‌హిళ‌ త‌న య‌వ్వ‌నం, అందంపై ఎన్న‌టికీ మోజు త‌గ్గ‌క వాటిని పెంపొందించేందుకు చేసిన ప‌నితో ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కొందనే స‌గ‌టు మ‌నిషి అస‌లు ఊహించ‌లేని పాయింట్‌తో, క‌థ‌నంతో ఈ సినిమా సాగుతుంది. హీరోయిన్‌గా ఎంతో స్టేట‌స్ తెచ్చుకున్న ఎలిజ‌బెత్ స్పార్కిల్ అనే న‌టి ఓ టీవీ ఛాన‌ల్‌లో చాలా కాలంగా ఓ ఏరోబిక్ క్లాసుల‌కు హోస్ట్‌గా చేస్తూ ఉంటుంది. అయితే కొంత‌కాలానికి ఆమె స్టేట‌స్ మ‌స‌క‌బారింద‌ని, వ‌య‌సైసోయింద‌నే కార‌ణంతో ఆ షో నుంచి స‌డ‌న్‌గా తొల‌గిస్తారు. ఈ క్ర‌మంలో ఓ రోజు ప్ర‌మాదానికి గురై ఆస్ప‌త్రిలో చేరుతుంది. త‌న అందం, వ‌య‌స్సు గురించి తీవ్ర మ‌నో వేద‌న‌కు గురౌతూ ఉంటుంది.


స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఆస్ప‌త్రిలో ఓ న‌ర్స్ ద్వారా పోయిన అందాన్ని, వ‌య‌స్సును తిరిగి తెప్పించే స‌బ్‌స్టాన్స్ అనే ఓ సీర‌మ్ గురించి తెలుసుకుని ఎలిజ‌బెత్ దానిని త‌న‌లోకి ఎక్కించుకుంటుంది. దాంతో త‌న వీపు భాగం నుంచి త‌న క‌న్నా చాలా అంద‌మైన‌, ప‌ద‌హారేళ్ల‌ వ‌యస్సు ఉండే ఓ యువ‌తి (సూ) బ‌య‌ట‌కు వ‌స్తుంది. అయితే ఆ సీర‌మ్ వాడిన‌వారు త‌ర్వాతి రోజుల్లో ఇద్ద‌రిలో ఒక‌రు ఎలిజ‌బెత్, ఆ యువ‌తి (సూ) ఎవ‌రైనా స‌రే వారం రోజులు అప‌స్మార‌కంలో చ‌ల‌నం లేకుండా ఉంటే మ‌రొక‌రు యాక్టివ్‌గా ఉండాల్సిన నిబంధ‌న‌ ఉంటుంది. పైగా 7 రోజుల‌కో సారి ఇద్ద‌రు త‌మలోని ఓ ద్ర‌వాన్ని బ‌దిలీ చేసుకోవాల్సిన సిట్యూవేష‌న్‌ ఉంటుంది. ఈక్ర‌మంలో బ‌య‌ట‌కు వ‌చ్చిన సూ అంత‌కుముందు ఎలిజ‌బెత్ ప‌ని చేసిన టీవీ షోకు ఎంపిక కావ‌డ‌మే కాక మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించి టాప్ సెల‌బ్రిటీగా అవ‌త‌రిస్తుంది.

ఈ నేప‌థ్యంలో సూ త‌న ఈ స్టేట‌స్‌ను ఇలానే కంటిన్యూ చేయాల‌నుకుని వారం అనే స‌మ‌స్య‌ను తొల‌గించ‌డ‌డానికి ఎలిజ‌బెత్ నుంచి అధిక మోతాదులో ద్ర‌వాన్ని బ‌య‌ట‌కు తీయ‌డం చేస్తుంది. దీంతో ఎలిజ‌బెత్ యాక్టివ్‌గా ఉండే వారానికొచ్చేస‌రికి ఆమె శ‌రీరంలో వీప‌రీత మార్పులు చోటు చేసుకుంటాయి. దీంతో రోజురోజుకు అంద వీహీనంగా త‌యార‌వుతూ వ‌చ్చిన ఎలిజ‌బెత్ ఏం చేసింది, ప్ర‌తిగా సూ చేసిన ప‌నేంటి, చివ‌ర‌కు సూ త‌న క‌ల‌ను సాధించ‌గ‌లిగిందా అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాల‌తో మూవీ సాగుతూ సినిమా చూసే ప్రేక్ష‌కుడిని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్ట‌డ‌మే కాక క్లైమాక్స్‌ ఓళ్లు జ‌ల‌ద‌రించేలా చేస్తుంది. సినిమాలో శృంగార స‌న్నివేశాలు లేన‌ప్ప‌టికీ చాలా సంద‌ర్భాల్లో న‌గ్నంగా ఉండే సీన్లు ఉంటాయి అవి ఈ సినిమాకు అవ‌స‌రం కూడా. ఇప్పుడీ సినిమా బ‌య‌టి దేశాల‌లో మాత్ర‌మే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో ఇండియాలోని ప్రేక్ష‌కుల‌కు నిరాశ త‌ప్ప‌డం లేదు. కానీ కొన్ని ఫ్రీ వెబ్‌సైట్లలో మ‌న దేశంలోనూ అందుబాటులో ఉంది. ఆస‌క్తి ఉన్న‌వారు వాటిని ఆశ్ర‌యించాల్సిందే. అయితే ఈ సినిమాను పెద్దలు మాత్ర‌మే చూడ‌డం బెట‌ర్‌. అందులోనూ లైట్ హార్టెడ్ ప‌ర్స‌న్ ఈ మూవీకి దూరంగా ఉండ‌డం ఇంకా మంచిది.

Updated Date - Oct 20 , 2024 | 04:48 PM