Viswam Review: గోపీచంద్‌, శ్రీను వైట్ల కాంబో ఫిల్మ్ ‘విశ్వం’ ఎలా ఉందంటే...

ABN, Publish Date - Oct 11 , 2024 | 05:20 PM

మాచో స్టార్ గోపీచంద్, హిట్ కోసం ఎదురు చూస్తోన్న శ్రీను వైట్ల కలయికలో 'విశ్వం' చిత్రం దసరా కానుకగా  శుక్రవారం  ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో  చూద్దాం 

సినిమా రివ్యూ: 'విశ్వం' (Viswam Review)
విడుదల తేదీ: 11–10–2024
నటీనటులు: గోపీచంద్‌(Gopichand), కావ్యథాపర్‌, కిక్‌ శామ్‌, నరేశ్‌, పృధ్వీ, జిషు సేన్  గుప్తా, ప్రగతి, వెన్నెల కిషోర్‌, వీటీవీ గణేశ్‌, రాహుల్‌ రామకృష్ణ, సునీల్‌, ముఖేశ్‌ రిషి, అజయ్‌ ఘోష్‌, రఘుబాబు, ప్రవీణ్‌, మాస్టర్‌ భరత్‌ తదితరులు.

సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్‌
సంగీతం: చేతన్‌ భరద్వాజ్‌
రచన: గోపీమోహన్‌, భాను–నందు, ప్రవీణ్‌ వర్మ
నిర్మాతలు: వేణు దోనెపూడి, టీజీ విశ్వప్రసాద్‌
దర్శకత్వం: శ్రీను వైట్ల (Srinu Vaitla)

దర్శకుడు శ్రీను వైట్ల హిట్‌ ట్రాక్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎంటర్‌మెంట్‌ చిత్రాలకు ఓ బ్రాండ్‌గా ఓ వెలుగు వెలిగారు. అయితే 'దూకుడు’ తర్వాత ఆయనకు చెప్పుకోదగ్గ విజయం లేదు. అయినప్పటికీ అవకాశాలు అందుకుంటూ హిట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆయన నుంచి వచ్చిన చిత్రం 'విశ్వం’.  కమర్షియల్‌ యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన మాచోస్టార్‌ గోపీచంద్‌తో శ్రీనువైట్ల చాలాకాలంగా సినిమా ప్లాన్‌ చేస్తున్నారు. అది విశ్వంతో కుదిరింది. ఇప్పుడీ కాంబోలో విజయదశమి బరిలో విడుదలైన విశ్వం ఇద్దరికీ విజయాన్ని అందించిందా? శ్రీను వైట్ల ఈజ్‌ బ్యాక్‌ అనిపించుకున్నారా? అన్నది చూద్దాం.  

కథ: (Vishwam)
పాకిస్థాన్‌ నుంచి ఇండియాకు వచ్చి ఐఎస్‌ఐఎస్‌ టెర్రరిస్ట్‌ జలాలుద్దీన్‌ ఖురేషి (జిషు ేసన్‌గుప్తా). ఇక్కడ సంజయ్‌ శర్మ అనే మారుపేరుతో ఇండియాలో ఉంటూ విద్యా వ్యవస్థ నడుపుతూ విద్యార్థుల్ని తీవ్రవాదులుగా తయారు చేస్తుంటాడు. భారత్‌ను నాశానం చేయాలనేది అతని ఆలోచన. దీనికోసం కేంద్రమంత్రి సీతారామరాజు (సుమన్‌) తమ్ముడైన బాచిరాజు(సునీల్‌)తో చేతులు కలుపుతాడు. ఆ విషయం మంత్రికి తెలియడంతో అతన్ని మర్డర్‌ చేసి చంపేస్తాడు జలాలుద్దీన్‌. ఈ హత్యను దర్శన అనే పాప చూస్తుంది. ఆ పాపను కూడా చంపాలనుకుంటాడు. ఆ పాపను గోపిరెడ్డి రక్షిస్తాడు. పాపకున్న థ్రెట్‌ తెలుసుకున్న అతను ఆమెకు రక్షణగా ఉండాలనుకుంటాడు.  అసలు హీరో గోపీచంద్‌.. ఆ పాపను కాపాడటానికి కారణం ఏంటి? అతని నేపథ్యం ఏంటి? సమైరా (కావ్య థాపర్‌)తో అతని ప్రేమకథ ఏమైంది? జలాలుద్దీన్‌ కశ్మీర్‌ వెళ్లి పన్నిన కుట్రలకు గోపీచంద్‌ ఉలా తిప్పికొట్టాడు. అసలు గోపీచంద్‌కు, కశ్మీర్‌లో ఉగ్రవాద సంస్థలకు సంబంధం ఏంటి? అన్నది మిగతా కథ.



విశ్లేషణ: (Vishwam Movie Review)
టెర్రరిస్ట్‌ల వల్ల దేశానికి థ్రెట్‌ ఏర్పడటం, వారి ప్రణాళికలు హీరో తిప్పి కొట్టడం, అందుకోసం తన ఐడెంటిటీని పక్కన పెట్టి మారు వేషంలో సీక్రెట్‌ మిషన్‌ తీసుకోవడం, మైండ్‌ గేమ్‌తో విద్రోహ శక్తుల్ని తన ట్రాప్‌లో పడేలా చేసి వాళ్లకు కేరాఫ్‌ లేకుండా చేయడం జనరల్‌గా ఈ తరహా చిత్రాల్లో చూస్తుంటాం. శ్రీనువైట్ల తీసిన తన గత చిత్రాల్లో కూడా ఇదే ఫార్ములా. ఈ చిత్రం విషయానికొస్తే.. ద్వారక రెస్టారెంట్‌లో జరిగే బాంబు బ్లాస్ట్‌తో సినిమా మొదలవుతుంది. ఆ వెంటనే జలాలుద్దీన్‌ పాత్రను పరిచయంతో నేరుగా కథలోకి సాగుతుంది. కేంద్రమంత్రిని బాచిరాజుతో కలిసి జలాలుద్దీన్‌ హత్య చేయడం.. ఆ నేరాన్ని దర్శన కళ్లారా చూడటం.. దీంతో ఆ చిన్నారిని చంపేందుకు కుట్ర మొదలెట్టడం.. తనను కాపాడే క్రమంలో ఫైట్‌తో హీరో ఎంట్రీ అంతా క్షణాల్లో జరిగిపోయినట్లు ఉంటుంది.  హీరో కథానాయిక ఇంట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి కథలో వేగం, సీరియెస్‌నెస్‌ తగ్గిపోయింది. .అక్కడి నుంచి పృథ్వీ పాత్రలో శ్రీను వైట్ల మార్క్‌ కామెడీ స్టార్ట్‌ అవుతుంది. జాలి బాబు గా పృథ్వీ వినోదం అలరిస్తుంది. ముందుగానే ఇటలీలో పరిచయం ఉన్న హీరోహీరోయిన్ల మధ్య లవ్‌ ట్రాక్‌ ఆర్గానిక్‌గా లేదు. ఆ సన్నివేశాలు విసుగు పుట్టించేలా ఉంటాయి. పాపపై మరో ఎటాక్‌ జరగడం, గోవాలో జరిగే యాక్షన్‌ ఎపిసోడ్‌తో కథ మళ్లీ ట్రాక్‌లో పడుతుంది. అక్కడితో విరాయం. ట్రైన్‌ సీన్‌తో ద్వితీయార్థం వినోదాత్మకంగా మొదలవుతుంది. ఈ ఎపిసోడ్‌లో టీసీగా వీటీవీ గణేశ్‌ అల్లరి, సురేష్‌ గోపిగా వెన్నెల కిషోర్‌ కామెడీ ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. ఇక సినిమా చివర్లో, విశ్వం (గోపీచంద్‌) ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌, యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌గా అతని హంగామా, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ శ్రీను వైట్ల గత హిట్‌ చిత్రాలను గుర్తు చేస్తాయి. క్లైమాక్స్‌ కూడా ప్రేక్షకుడి ఊహకు అందేలా ఉంది. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు చూస్తున్నంత సేపు ుదూకుడు’, బాద్‌షా సినిమాలు చూసిన భావనే కలుగుతుంది. అయితే ఇక్కడ హీరో గోపీచంద్‌.. అంతే తేడా. దూకుడులో తండ్రి ఎమోషన్‌ అయితే ఇక్కడ దర్శన అనే పాపను కీలకంగా తీసుకున్నారు. (Vishwam Movie review)

Also Read- Janaka Aithe Ganaka Review: ‘జనక అయితే గనక’ మూవీ ప్రీ రిలీజ్ రివ్యూ



నటీనటుల పనితీరు వస్తే..
ఈ చిత్రానికి ప్రధాన బలం గోపీచంద్‌ యాక్షన్‌. తనదైన శైలిలో స్టైలిష్‌గానే కనిపించారు. యాక్షన్‌ పాత్రతో మెప్పించారు. కావ్య థాపర్‌ నటన పరంగా అంతగా ఆకట్టుకోకపోయినా గ్లామర్‌తో ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది. ఆమె పాత్రకు పెద్ద నిడివి లేదు కానీ డాన్స్‌లతో ఆకట్టుకుంది. టెర్రరిస్ట్‌గా  జిషు సేన్  గుప్తా ఆకట్టుకున్నారు. సునీల్‌ కూడా ఓ విలన్‌లాంటి పాత్రే అయినా అది రెండు మూడు చోట్ల తప్ప పెద్దగా కనిపించలేదు. కామెడీ విలన్‌గా ఓకే అనిపించారు. ఈ కథలో కీలకమైన దర్శన పాత్ర పోషించిన చిన్నారి చక్కటి నటనతో ఆకట్టుకుంది. నరేశ్‌, ప్రగతి, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, వీటీవీ గణేశ్‌, అజయ్‌ ఘోష్‌., ముఖేష్‌రిషి ఇలా బోలెడంత మంది ఆర్టిస్ట్‌లు తెరపైకి వచ్చి వెళ్లారు కానీ వాళ్ల ప్రతిభకు తగ్గట్లు దర్శకుడు హాస్యాన్ని, నటనను చూపించలేకపోయారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన వెంకీ చిత్రంలో ట్రైన్‌ ఎపిసోడ్‌ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌. ఈ చిత్రంలో కూడా అలాంటి ఓ ప్రయత్నం చేశారు. ఆ సన్నివేశాల్లో క్యారెక్టర్లు వరుసగా వస్తాయి. కానీ గుర్తుంచుకునే కామెడీని అందించలేకపోయారు. అలాంటి మ్యాజిక్స్‌ అన్ని సార్లు వర్కవుట్‌ కాదని ఈ  ఎపిసోడ్‌ ద్వారా తెలుస్తోంది. కమర్షియల్‌ డైరెక్టర్‌గా శ్రీను వైట్ల త్రన పేరును ఎక్కడా చెడగొట్టుకోలేదు కానీ రొటీన్‌ ఫార్ములాతోనే లాగించేశారు. కథ.. కథనాల్లో కొత్తదనం చూపించలేకపోతున్నారు.

గుహన్‌ కెమెరా పనితనం ప్రతి ఫ్రేములోనూ కనిపించింది. పాటలు, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ పిక్చరైజేషన్స్‌ అద్భుతంగా చేశారు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం ఓకే అనిపిస్తుంది. దర్శన తల్లి గురించి చెబుతూ సాగే పాట భావోద్వేగానికి లోను చేస్తుంది. భీమ్స్‌ సంగీతం అందించిన ‘గుంగురూ గుంగురూ’ పాట మాస్‌ ఆడియన్స్‌ని  అలరిస్తుంది. రొటీన్‌ కథను నిర్మాతలు అంగీకరించడం గొప్ప విషయంనిర్మాతలు మాత్రం ఎక్కడా తగ్గలేదు. అనుకున్న బడ్జెట్‌ కన్నా ఎక్కువే ఖర్చు చేసుతంటారని సినిమా క్వాలిటీ లొకేషన్లు చూస్తే అర్థమవుతోంది.  రోజులు మారుతున్నాయి.. ఆడియెన్స్‌ కొత్తదనం కోరుకుంటున్నారు.. ఓటీటీల్లో కొత్త కంటెంట్‌ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇలాంటి సమయంలో పరాజయాల్లో ఉన్న దర్శకుడు. హీరో మ్యాజిక్‌ చేయాలి. కొత్తదనం చూపించి ప్రేక్షకుల్ని మెప్పించాలి. ఇవన్నీ దర్శకుడు శ్రీను వైట్లకు తెలుసు. గ్యాప్‌లో కాలానికి తగ్గట్టు మారాలని, అప్‌డేట్‌ అవ్వాలని ఆ దిశగా ప్రయత్నాలు చేశానని సినిమా ప్రమోషన్స్‌లో చెప్పుకొచ్చారు. అయితే విశ్వం చిత్రాన్ని తెరపై చూశాక.. ఆయనలో ఎలాంటి అప్‌డేట్‌ లేదని అర్థం అవుతుంది. గ్యాప్‌లో సినిమాను ఎలా రిచ్‌గా తీయాలి, కొత్త లొకేషన్స్‌ ఎక్కడున్నాయి అన్నదానిపై దృష్టి పెట్టినట్లు ఉన్నారు. అతని కథ, కథనంలో కొత్తదనం మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే  శ్రీనువైట్ల ఫార్ములా నుంచి ఇంకా బయటకు రాలేదని క్లియర్‌గా అర్థమవుతోంది. శ్రీనువైట్ల తన ఫార్ములా నుంచి బయటకొచ్చి కథ తయారు చేసుంటే... దర్శకుడిగా ఆయనకు, హీరోకు మంచి విజయం వచ్చేది.

ట్యాగ్‌లైన్‌: రొటీన్‌.. రొటీన్‌.. రొటీన్‌

Also Read- Vettaiyan Review: రజనీకాంత్ నటించిన యాక్షన్ మూవీ ‘వేట్ట‌య‌న్... ది హంట‌ర్‌’ ఎలా ఉందంటే.. 

Also Read- Maa Nanna Superhero Review: సుధీర్‌బాబు నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉందంటే..
 
 
 -మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 11 , 2024 | 05:29 PM