Film Review: 'డ్రింకర్ సాయి' ఎలా ఉందంటే..
ABN, Publish Date - Dec 28 , 2024 | 01:26 AM
ఇటీవల కాలంలో ట్రైలర్‌తో అలరించి, క్రేజ్ తెచ్చుకున్న చిత్రం డ్రింకర్ సాయి’. బాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అసభ్యకర డైలాగ్‌లతోపాటు ఎమోషనల్ కంటెంట్ ఉండడంతో ఈ చిత్రం ట్రైలర్‌కు చక్కని స్పందన వచ్చింది.
సినిమా రివ్యూ: డ్రింకర్ సాయి (Drinker jasu11
విడుదల తేది: 27–12–2024
నటీనటులు: ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, భద్రం, ఎస్‌ఎస్ కాంచి, కిర్రాక్ సీత, రీతు చౌదరి తదితరులు.
సాంకేతిక నిపుణులు:
కెమెరా: ప్రశాంత్ అంకిరెడ్డి
సంగీతం: శ్రీవసంత్
నిర్మాతలు: బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు హరిధర్
రచన, దర్శకత్వం: కిరణ్ తిరుమలశెట్టి (kishore tarimalasheety )
ఇటీవల కాలంలో ట్రైలర్‌తో అలరించి, క్రేజ్ తెచ్చుకున్న చిత్రం డ్రింకర్ సాయి’. బాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అసభ్యకర డైలాగ్‌లతోపాటు ఎమోషనల్ కంటెంట్ ఉండడంతో ఈ చిత్రం ట్రైలర్‌కు చక్కని స్పందన వచ్చింది. ప్రమోషన్స్ కూడా డిఫరెంట్‌గా ప్లాన్ చేయడంతో డ్రింకర్ సాయి’కి బజ్ పెరిగింది. ఈ ఏడాది విడుదలైన చివరి చిత్రాల్లో ఇదొకటి. మరి చిత్రం ఎలా ఉందో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ: (Drinker sai Review)
సాయి అలియాస్ డ్రింకర్ సాయి ఽ(దర్మ) బాగా ధనవంతుడు. తల్లిదండ్రులు చనిపోవడంతో తాగుడుకు బానిసవుతాడు. నిత్యం తాగుతూ అందరితో గొడవలు పడడం.. అరెస్ట్ అవ్వడం అతని దినచర్య. అతని బంఽధువు (శ్రీకాంత్ అయ్యంగార్) బెయిల్‌పై విడిపించడం..ఇదే తంతు నడుస్తుంటుంది. ఓ సారి బాగా తాగి ఉన్న సాయిని మెడికల్ స్టూడెంట్ బాగి(ఐశ్వర్య శర్మ) తన బైక్‌తో ఢీకొట్టి పారిపోతుంది. మరుసటి రోజు తనకు యాక్సిడెంట్ చేసింది బాగినే అని తెలుసుకుంటాడు సాయి. అమెతో గొడవపడేందుకు వెళ్లి.. ప్రేమలో పడిపోతాడు. బాగికి మాత్రం అతనంటే అసలు ఇష్డం ఉండదు. ఈ విషయం సాయికి చెబితే ఎక్కడ గొడవ చేస్తాడోనని ప్రేమించినట్లు నటిస్తుంది. బాగి ప్రేమను పొందేందుకు సాయిు చేసిన ప్రయత్నాలు ఏంటి? బాగి తనను ప్రేమించట్లేదని తెలిసిన తర్వాత అతనేం చేశాడు. తనకు ఉన్న తాగుడు అలవాటు ఎక్కడకు దారి తీసింది? చివరకు సాయి బాగి ప్రేమను పొందాడా లేదా? అన్నది కథ.
విశ్లేషణ: Drinker sai Review)
హీరో తాగుబోతుగా ఉండటం, జులాయిగా తిరగడం.. ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడడం.. ఏదోలా ఆ అమ్మాయి ప్రేమను పొందడం ఇదే ఇతివృత్తంతో లెక్కలేనని సినిమాలొచ్చాయి. డ్రింకర్ సాయి కూడా అలాంటి చిత్రమే. తాగుడుకు బానిసైన హీరో.. తనలాంటి వాడిని చూస్తేనే చిరాకు పడే అమ్మాయిని ప్రేమలో పడేయడం అన్నది ఈ సినిమా కథ. రొటీన్ కథే అయినా క్లైమాక్స్‌లో ఇచ్చిన సందేశం బావుంది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బావుంది. ఆ పాయింట్‌ను ఎగ్జిక్యూట్ చేయడంలో తడబడ్డాడు. రాసుకున్న స్ర్కీన్‌ప్లే వీక్‌గా ఉంది. ఇందులో లవ్‌స్టోరీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోకపోవడానికి కారణమిదే. హీరో హీరోయిన్ వెంట పడటం, ఆమె ఛీ కొట్టడం.. చివరి వరకు ఇదే తంతు. లవ్‌స్టోరీలో కూడా కొత్తదనం ఉండదు. సినిమా మొదలుకొని ఇంటర్వెల్ వరకూ కథ ఫన్‌గా సాగుతుంది. అయితే వంతెన (భద్రం) పాత్ర వచ్చిన ప్రతిసారి కామెడీ పండకపోగా.. ఒక ఫ్లోలో సాగుతున్న ప్రేమ కథకు ఇరికించి నట్లు ఉంటుంది. పాటలు మాత్రం ఆకట్టుకున్నాయి. ఇంటర్వెల్ సీన్ రొటీన్. సెకండాఫ్ ఎక్కువ భాగం వంతెన ఆశ్రమంలో కథనం సాగుతుంది.
సింధూరం సినిమా తర్వాత ధర్మ నటించిన చిత్రమిది. రెండో సినిమాతో మాత్రం నటుడిగా ఓ మెట్టు ఎక్కాడు, కెమెరా ఫియర్ లేకుండా చేశాడు. చక్కని భావోద్వేగాలు పంపాడు. ఐశ్వర్య శర్మ కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. భాగి పాత్రలో ఇమిడిపోయింది. వంతెనగా భద్రం నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. శ్రీకాంత్ అయ్యంగార్, కిర్రాక్ సీత, రీతూతో పాట ఇతర తారలు పరిమిధిలో నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. శ్రీవసంత్ సంగీతం సినిమా స్థాయిని పెంచింది. పాటలు ఓకే. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు బావున్నాయి. మొదట ట్రైలర్ చూసినప్పుడు ఇదొక బోల్డ్ మూవీ, బూతులుంటాయి అన్న భావన కలుగుతుంది. కానీ తెరపై అలా లేదు. బోల్డ్ కంటెంట్ ఉంది కానీ ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలతో కంపేర్ చేస్తే ఇది ఫర్వాలేదనిపిస్తుంది. చివరి అరగంట కాస్త భావోద్వేగంగా సాగుతుంది. (Drinker sai Review)
ట్యాగ్‌లైన్: రొటీన్ లవ్‌స్టోరీ