సున్నా నుంచి 35 మార్కులు
ABN, Publish Date - Sep 02 , 2024 | 04:14 AM
నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజా ప్రధాన పాత్రలు పోషించిన ‘35.. చిన్నకథ కాదు’ చిత్రం ట్రైలర్‌ను అక్కినేని నాగార్జున ఆదివారం విడుదల చేశారు...
నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజా ప్రధాన పాత్రలు పోషించిన ‘35.. చిన్నకథ కాదు’ చిత్రం ట్రైలర్‌ను అక్కినేని నాగార్జున ఆదివారం విడుదల చేశారు. లెక్కల సబ్జెక్ట్‌తో ఇబ్బంది పడుతున్న ఓ స్టూడెంట్‌ను పరిచయం చేస్తూ ట్రైలర్ మొదలైంది. ఆ పిల్లాడి తల్లితండ్రులుగా నివేద, విశ్వదేవ్ నటించారు. కొడుకు భవిష్యత్ గురించి ఆందోళన చెందుతుంటారు. ఆ పిల్లాడిని టీచర్, క్లాసులో ఇతర స్డూడెంట్స్ ‘సున్నా’ అని పిలుస్తూ అవహేళన చేస్తుంటారు. ఆ కుర్రాడు సవాళ్లను అధిగమించి, 35 మార్కులతో ఉత్తీర్ణత సాధించడం ఈ చిత్రకథ. దర్శకుడు నందకిశోర్ ఈమని ఆసక్తికరంగా రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదలవుతోంది. రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్దార్థ్ రాళ్లపల్లి నిర్మించారు.