Anand Deverakonda: చిన్న దేవరకొండ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయింది
ABN, Publish Date - Apr 29 , 2024 | 05:39 PM
అన్నయ్య విజయ్ దేవరకొండ విజయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే, తమ్ముడు ఆనంద్ 'బేబీ' సినిమాతో గొప్ప విజయం సాధించటమే కాకుండా రూ. వంద కోట్ల క్లబ్బులోకి కూడా చేరాడు. అతని తదుపరి సినిమా ఒక యాక్షన్ నేపథ్యంలో వచ్చే 'గం గం గణేశా' విడుదల తేదీ కూడా ప్రకటించారు
విజయ్ దేవరకొండ ఒక పక్క విజయం కోసం పరితపిస్తూ ఉంటే, అతని తమ్ముడు ఆనంద్ దేవరకొండ 'బేబీ' అనే సినిమాతో గొప్ప విజయం సాధించటమే కాకుండా, ఆ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్ లోకి కూడా చేరిపోయాడు. ఇప్పుడు అతని తదుపరి సినిమా 'గం.. గం.. గణేశా' తో వస్తున్నాడు. అయితే ఈ సినిమా విడుదల తేదీ ఇప్పుడు ప్రకటించారు చిత్ర నిర్వాహకులు. ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని మే 31న విడుదల చేస్తున్నట్టుగా ఈరోజు అధికారికంగా ప్రకటించారు.
'బేబీ' సినిమాతో మంచి విజయం అందించిన ఆనంద్ ఆ సినిమాతో తన మార్కెట్ ను పెంచుకున్నాడు. అందుకనే ఈ 'గం..గం..గణేశా' పూర్తయి చాలా కాలం అవుతున్న మంచి విడుదల తేదీ కోసం ఎదురుచూసి ఇప్పుడు ప్రకటించారు. ఈ సినిమాని కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు.
ఈ సినిమా నేపధ్యం యాక్షన్ అని, ఆనంద్ దేవరకొండ ఇంతకు ముందు చేసిన సినిమాలు కొంచెం ప్రేమ, వినోదాత్మకంతో కూడినవి ఉంటే, ఈ సినిమాతో యాక్షన్ జానర్ లోకి అడుగుపెట్టాడు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా టీజర్ ఇంతకు ముందే విడుదలైంది.
అప్పుడే ఈ సినిమా యాక్షన్ నేపధ్యం అని అర్థం అయిపోతుంది. ఈరోజు ఈ సినిమా విడుదల తేదీ ప్రకటన సందర్భంగా విడుదలైన పోస్టర్ లో కూడా ఆనంద్ దేవరకొండ ఒక తుపాకీ పట్టుకొని నిలుచున్నది విడుదల చేశారు. దానిని బట్టి ఇది ఒక పోరాటనేపధ్యంలో వస్తున్న సినిమా అని చెపుతున్నారు. ఆనంద్ దేవరకొండ తో పాటు ఇందులో ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్ తదితరులు నటించారు.