Devara: సెకండ్ సాంగ్ రిలీజ్ అప్డేట్.. ఎన్టీఆర్, జాన్వీల పిక్ అదిరింది ‘దేవర’!

ABN , Publish Date - Aug 02 , 2024 | 05:42 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. కొర‌టాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం రెండు పార్ట్‌లుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి పార్ట్‌కు సంబంధించి శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ జ‌రుగుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమా సెకండ్ సింగిల్‌ను ఆగస్ట్ 5న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ఓ పోస్టర్ వదిలారు.

Devara Movie Still

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’ (Devara). కొర‌టాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం రెండు పార్ట్‌లుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి పార్ట్‌కు సంబంధించి శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ జ‌రుగుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల రిలీజ్ డేట్‌ను ఫైనల్‌గా ఫైనల్ చేశారు. సెప్టెంబ‌ర్ 27న తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో.. ఎంటైర్ ఇండియాలోని సినీ ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకునేలా ఈ పాన్ ఇండియా భారీ చిత్రాన్ని విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకవైపు శరవేగంగా చిత్రీకరణను జరుపుతూనే.. మరోవైపు ఈ చిత్ర ప్రమోషన్స్‌పై మేకర్స్ దృష్టి పెట్టారు. తాజాగా ఈ సినిమా సెకండ్ సింగిల్ రిలీజ్‌కు సంబంధించిన అప్డేట్‌ని మేకర్స్ వదిలారు. (Devara Second Single Release Update)

Also Read- Thiragabadara Saami Review: రాజ్ తరుణ్ హిట్ అందుకున్నాడా లేదా? 

ఇటీవల మొదటి సింగిల్ ‘ఫియర్ సాంగ్’ (Fear Song)ను రిలీజ్ చేయటం ద్వారా ఫిల్మ్ మేకర్స్ ‘దేవర’ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట అన్నీ మాధ్యమాల్లో గ్లోబల్ రేంజ్‌ సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. ఇప్పుడు సెకండ్ సింగిల్‌ని ఆగస్ట్ 5న విడుదల చేయబోతున్నట్లుగా చెబుతూ.. మేకర్స్ అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే రాబోయే సాంగ్ ఓ రేంజ్‌లో ఉండబోతుందనే హింట్ ఇస్తోంది. ఈ పోస్టర్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్మైలింగ్ బ్యూటీ జాన్వీ కపూర్ రొమాంటిక్ మూడ్‌లో కనిపిస్తున్నారు. ఈ పాట ఈ సినిమాకే హైలెట్ అనేలా చిత్రీకరణ జరిపినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఇక పాట వస్తే.. ఫ్యాన్స్‌కి పండగే అని చెప్పొచ్చు.


Devara-Movie.jpg

‘దేవర: పార్ట్ 1’ (Devara Part 1) కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ప‌వ‌ర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజ‌న్స్‌, కొర‌టాల శివ టేకింగ్‌ను ఎప్పుడెప్పుడు సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూద్దామా అని అభిమానులు, ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ‘దేవర’గా టైటిల్ పాత్ర‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, న‌రైన్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - Aug 02 , 2024 | 05:42 PM

Devara Part 1: ‘దేవర’ మూవీ ‘ఫియర్’ సాంగ్ ప్రోమో

Devara Part 1: ‘దేవర’.. ఫియర్ సాంగ్ వీడియో

Devara: 'దేవర'లో శ్రుతీ మరాఠే పాత్ర ఏంటో చెప్పేసింది!

Devara Fear Song: అగ్గంటుకుంది సంద్రం.. భగ్గున మండే ఆకశం’

Devara: గ్లింప్స్‌ సర్‌ప్రైజ్‌.. డబుల్‌ ట్రీట్‌ ఖాయం!