మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Devaki Nandana Vasudeva: అశోక్ గల్లా బర్త్‌డే.. సాంగ్ ప్రోమో విడుదల

ABN, Publish Date - Apr 05 , 2024 | 07:14 PM

‘హీరో’ చిత్రంతో సక్సెస్ ఫుల్‌గా ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ప్రస్తుతం ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ‘దేవకీ నందన వాసుదేవ’ అనే సినిమా చేస్తున్నారు. శుక్రవారం అశోక్ గల్లా పుట్టినరోజు సందర్భంగా సర్‌ప్రైజ్ ట్రీట్‌తో ముందుకు వచ్చారు చిత్ర మేకర్స్. ఈ సినిమా నుండి ‘ఏమయ్యిందే’ అనే ఫస్ట్ సింగిల్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు.

Ashok Galla in Devaki Nandana Vasudeva

‘హీరో’ చిత్రంతో సక్సెస్ ఫుల్‌గా ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) ప్రస్తుతం ‘గుణ 369’ (Guna 369) ఫేమ్ అర్జున్ జంధ్యాల (Arjun Jandyala) దర్శకత్వంలో ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) అనే సినిమా చేస్తున్నారు. ‘హనుమాన్’ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ చిత్రానికి కథ అందించారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా (Sai Madhav Burra) డైలాగ్స్ రాస్తున్నారు. లలితాంబిక ప్రొడక్షన్స్‌లో ప్రొడక్షన్‌ నెం. 1గా ఎన్‌ఆర్‌ఐ (ఫిలిం డిస్ట్రిబ్యూటర్‌) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు.

*Galla Ashok: సితార సంస్థలో అశోక్ గల్లా సినిమా 


గతంలో కథానాయకుడి పాత్రను పరిచయం చేసిన టీజర్‌ సినిమా ప్రిమైజ్‌ని ప్రజెంట్ చేసింది. టీజర్‌ మంచి స్పందనను రాబట్టుకోగా.. శుక్రవారం అశోక్ గల్లా పుట్టినరోజు (#HBDAshokGalla) సందర్భంగా సర్‌ప్రైజ్ ట్రీట్‌తో ముందుకు వచ్చారు చిత్ర మేకర్స్. ‘ఏమయ్యిందే’ అనే ఫస్ట్ సింగిల్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. (Devaki Nandana Vasudeva)


ఇటీవలి కాలంలో అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) ఆకట్టుకునే బీట్‌లతో ఈ పాటని స్వరపరచినట్లుగా ఈ ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. ఈ పాట అశోక్ గల్లా తన లవర్ వారణాసి మానస (Varanasi Manasa) పట్ల చూపుతున్న ఆరాధనను చూపుతుంది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. కానీ తమ రిలేషన్‌ని సీక్రెట్‌గా వుంచుతారు. ఈ పాటలో అశోక్ గల్లా ఆనందంగా కనిపించగా, వారణాసి మానస అందంగా ఉంది. వీరి జోడి తెరపై ఆకర్షణీయంగా కనిపిస్తోంది. త్వరలోనే ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్‌తో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటర్ కాగా.. ప్రసాద్ మూరెళ్ల డీవోపీగా పని చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Kona Venkat: తారక్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తా..

************************

*Paiyaa: 14 యేళ్ల తర్వాత ‘పయ్యా’ రీ రిలీజ్‌

*******************************

*Vijay Deverakonda: అలా చెప్పడం తప్పు కాదు.. అలా చెప్పి కొట్టకపోవడం తప్పు

******************************

Updated Date - Apr 05 , 2024 | 07:14 PM