హారర్ కామెడీగా ‘యజ్ఞ’
ABN, Publish Date - Jul 15 , 2024 | 02:50 AM
ప్రదీప్ రెడ్డి, శివ నాయుడు, గోవా జ్యోతి ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘యజ్ఞ’. సుమన్ శెట్టి, జబర్దస్త్ అప్పారావు, చిట్టిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రజల్లు ప్రసాద్‌యజ్ఞ దర్శకత్వంలో...
ప్రదీప్ రెడ్డి, శివ నాయుడు, గోవా జ్యోతి ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘యజ్ఞ’. సుమన్ శెట్టి, జబర్దస్త్ అప్పారావు, చిట్టిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రజల్లు ప్రసాద్‌యజ్ఞ దర్శకత్వంలో చిలుకోటి రఘురామ్, చీలపల్లి విఠల్‌గౌడ్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్రజల్లు ప్రసాద్ యజ్ఞ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాను యజ్ఞంలా భావించి చేశాం. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీ అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అని అన్నారు. ‘‘కొత్త తరహా కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుస్తుంది’’ అని నిర్మాత విఠల్‌గౌడ్ చెప్పారు. ‘‘ఈ మూవీ సినిమా ప్రేక్షకులకు ఫుల్ మీల్స్‌లా ఉంటుంది’’ అని హీరో శివనాయుడు అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జి.కృష్ణ నాయుడు, సుధాకర్ నాయుడు.కె. సంగీతం: లక్ష్మణసాయి