జనతా బార్‌లో కుస్తీ పోటీలు
ABN , Publish Date - Apr 12 , 2024 | 05:33 AM
రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జనతా బార్’. రమణ మొగిలి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు శక్తికపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు...

రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జనతా బార్’. రమణ మొగిలి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు శక్తికపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘కుస్తీ పోటీల నేపథ్యంలో నడిచే కథ ఇది. నేటి సమాజంలో మహిళ ప్రాధాన్యాన్ని చెప్పే సినిమా ఇది.’ అని చెప్పారు.
‘బార్ గర్ల్‌గా ఉన్న యువతి మహిళలు గర్వపడే స్థాయికి ఎలా చేరిందన్న కథతో ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రం నేను చేయకపోతే ఓ మంచి అవకాశం కోల్పోయేదాన్ని’ అన్నారు లక్ష్మీరాయ్. ‘యానిమల్’ తర్వాత మళ్లీ ఓ మంచి పాత్రను ఈ సినిమాలో చేసే అవకాశం లభించిందని శక్తి కపూర్ చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: అశ్వథ్ నారాయణ.