సందేశంతో ‘జనక అయితే గనక’
ABN, Publish Date - Aug 20 , 2024 | 02:44 AM
సుహాస్, సంగీర్తన జంటగా నటిస్తున్న చిత్రం ‘జనక అయితే గనక’. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహిస్తున్నారు...
సుహాస్, సంగీర్తన జంటగా నటిస్తున్న చిత్రం ‘జనక అయితే గనక’. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు, శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు. ఇటీవలే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. కథానాయకుడు సుహాస్ పుట్టినరోజు సందర్భంగా.. సోమవారం ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘నా ఫేవరెట్ నా పెళ్ళాం’’ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘ఇది చాలా మంచి సందేశంతో నిండిన కథ. పిల్లల్ని కనాలంటే చేతినిండా డబ్బులుండాలి.. పిల్లలకు బెస్ట్ ఇవ్వలేనప్పుడు వారిని కనకూడదు అని ఆలోచించే మనస్తత్వం ఉన్న మధ్య తరగతి వ్యక్తి క్యారెక్టర్‌లో సుహాస్ నటించారు. చాలా రోజుల తర్వాత ఓ మంచి చిత్రం చూశామనే సంతృప్తి ఈ సినిమాతో కలుగుతుంది’’ అని చెప్పారు. ‘‘ఇది నా జీవితంలో మరిచిపోలేని సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. ఈ పాటకు విజయ్ బుల్గానిన్ వినసొంపైన సంగీతాన్ని.. కృష్ణకాంత్ ఆకట్టుకునే సాహిత్యాన్ని ఇచ్చారు’’ అని సుహాస్ అన్నారు. సెప్టెంబరు 7న వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా విడుదలవుతోంది.