టైమ్‌ ట్రావెల్‌ కాన్సె్‌ప్టతో...

ABN, Publish Date - Nov 05 , 2024 | 06:44 AM

సైన్స్‌ ఫీక్షన్‌, మైథాలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘రహస్యం ఇదం జగత్‌’. కోమల్‌ ఆర్‌. భరద్వాజ్‌ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మించారు...

సైన్స్‌ ఫీక్షన్‌, మైథాలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘రహస్యం ఇదం జగత్‌’. కోమల్‌ ఆర్‌. భరద్వాజ్‌ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మించారు. రాకేష్‌ గలేబి, స్రవంతి ప్రత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం ముఖ్య తారలు. ఈనెల 8న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా కథానాయికలు మానస వీణ, స్రవంతి ప్రత్తిపాటి మీడియాతో ఆదివారం ముచ్చటించారు. ‘మాసన వీణ మాట్లాడుతూ ‘ఇది నా తొలి ఫీచర్‌ ఫిల్మ్‌. ఇందులో అరుణి ఆచార్య అనే పాత్రలో నటించాను. ఈ పాత్ర నాకు పర్సనల్‌గా ఎంతో నచ్చింది. ముఖ్యంగా కథ వినగానే సైన్స్‌ ఫీక్షన్‌కు మైథాలజీని కనెక్ట్‌ చేసి టైమ్‌ ట్రావెల్‌ కాన్సె్‌ప్టతో సినిమా నేపథ్యం ఉండటం నన్ను ఆకర్షించింది. ఈ చిత్రంలో నా పాత్ర కోసం రీసెర్చ్‌ కూడా చేశాను’ అని చెప్పారు. స్రవంతి ప్రత్తిపాటి మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో నా పాత్ర పేరు అకిరా. తప్పకుండా ఈ పాత్ర అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ నాకు తాత వరుస అవుతారు. ఆయన సలహాలు, సూచనలు నా కెరీర్‌ కోసం తీసుకున్నాను’ అని తెలిపారు.

Updated Date - Nov 05 , 2024 | 06:44 AM