అద్భుతమైన విజువల్స్‌తో...

ABN, Publish Date - Sep 19 , 2024 | 06:59 AM

నటుడు రవిశంకర్‌ దర్శకుడిగా పరిచయమౌతున్న చిత్రం ‘సుబ్రమణ్య’. ఆయన తనయుడు అద్వయ్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో పాన్‌ ఇండియా స్థాయిలో...

నటుడు రవిశంకర్‌ దర్శకుడిగా పరిచయమౌతున్న చిత్రం ‘సుబ్రమణ్య’. ఆయన తనయుడు అద్వయ్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తిరుమల్‌రెడ్డి, అనిల్‌ కడియం నిర్మిస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్‌ ఇటీవలే విడుదలైంది. అద్భుతమైన విజువల్స్‌తో నిండిన ఈ సినిమా గ్లింప్స్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుగుతోంది. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - Sep 19 , 2024 | 06:59 AM