అలరించే హంగులతో...

ABN, Publish Date - Oct 06 , 2024 | 02:53 AM

శ్రద్ధాదాస్‌, అజయ్‌, మాస్టర్‌ మహేంద్రన్‌ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘త్రికాల’. ‘స్ర్కిప్ట్‌ ఆఫ్‌ గాడ్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. మణి తెల్లగూటి దర్శకత్వంలో రాధికా శ్రీనివాస్‌ నిర్మించారు...

శ్రద్ధాదాస్‌, అజయ్‌, మాస్టర్‌ మహేంద్రన్‌ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘త్రికాల’. ‘స్ర్కిప్ట్‌ ఆఫ్‌ గాడ్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. మణి తెల్లగూటి దర్శకత్వంలో రాధికా శ్రీనివాస్‌ నిర్మించారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం టైటిల్‌ పోస్టర్‌ను నిర్మాత దిల్‌రాజు ఆవిష్కరించి యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పురాణాల స్ఫూర్తితో రాసుకున్న కథ ఇది, ఈతరం ప్రేక్షకులను అలరించేలా అన్ని హంగులతో తెరకెక్కించాం అని దర్శకుడు తెలిపారు. సరికొత్త సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ను అందించే చిత్రమిదని నిర్మాత చెప్పారు. సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, సినిమాటోగ్రఫీ: పవన్‌ చెన్నా

Updated Date - Oct 06 , 2024 | 02:53 AM