సిక్స్ ప్యాక్‌తో..
ABN, Publish Date - Oct 16 , 2024 | 06:15 AM
శారీరకంగా, డిక్షన్ పరంగా మరింత మెరుగ్గా కనిపించడానికి కృషి చేస్తున్నానని హీరో సాయిదుర్గా తేజ్ ఆ మధ్య వెల్లడించారు. ఆ విషయం నిజమేననిపించింది ఆయన తాజా చిత్రం మేకింగ్ వీడియో చూసిన తర్వాత....
శారీరకంగా, డిక్షన్ పరంగా మరింత మెరుగ్గా కనిపించడానికి కృషి చేస్తున్నానని హీరో సాయిదుర్గా తేజ్ ఆ మధ్య వెల్లడించారు. ఆ విషయం నిజమేననిపించింది ఆయన తాజా చిత్రం మేకింగ్ వీడియో చూసిన తర్వాత. సాయిదుర్గా తేజ్ పుట్టిన రోజు సందర్బంగా ఈ వీడియో విడుదల చేశారు. ‘ఎస్డీటీ 18’ అనే వర్కింగ్ టైటిల్లో రూపొందుతున్న చిత్రమిది. ‘ధైర్యాన్నే తన కవచంగా, ఆశనే ఆయుధంగా చేసుకున్న ఈ వ్యక్తి అందరికోసం నిలబడతాడు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే’ అనే క్యాప్షన్‌తో వీడియో ఉంది. ఇందులో సాయితేజ్ లుక్ చూపించలేదు కానీ సిక్స్ ప్యాక్‌తో కండలు తిరిగిన ఆ దేహాన్ని వెనుక నుంచి చూపించడం విశేషం. ఈ సందర్భంగా సాయి దుర్గా తేజ్‌కు మేకర్స్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.