బరువెక్కిన హృదయంతో...
ABN, Publish Date - Aug 07 , 2024 | 01:05 AM
గతంలో కుదుర్చుకున్న పలు చిత్రాల ఒప్పందం కారణంగా బిగ్‌బాస్ నుంచి స్వల్ప విరామం తీసుకుంటున్నట్టు అగ్రనటుడు కమల్ హాసన్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన...
గతంలో కుదుర్చుకున్న పలు చిత్రాల ఒప్పందం కారణంగా బిగ్‌బాస్ నుంచి స్వల్ప విరామం తీసుకుంటున్నట్టు అగ్రనటుడు కమల్ హాసన్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. ‘ఏడు సంవత్సరాల క్రితం ప్రారంభమైన ప్రయాణం నుంచి ఒక చిన్న విరామం తీసుకుంటున్నాననే విషయాన్ని బరువెక్కిన హృదయంతో ప్రకటిస్తున్నాను. బిగ్ బాస్ కారణంగానే మీ ఇళ్ళకు వచ్చి మిమ్మల్ని కలుసుకునే భాగ్యం నాకు లభించింది. మీరు అందించిన ఉద్వేగపూరిత, ఉత్సాభరిత మద్దతు, ఆదరణ కారణంగా బిగ్‌బాస్ తమిళ సీజన్ దేశంలోనే ఉత్తమ టెలివిజన్ రియాలిటీ షోలలో ఒకటిగా మారింది. ఒక ప్రెజెంటర్‌గా నేను వ్యక్తిగతంగా నేర్చుకున్న అనేక విషయాలను నిజాయితీగా మీతో పంచుకున్నాను’ అని కమల్ హాసన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఆంధ్రజ్యోతి (చెన్నై)