డబుల్‌ థ్రిల్‌తో...

ABN, Publish Date - Sep 10 , 2024 | 03:34 AM

శ్రీసింహ కోడూరి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మత్తు వదలరా 2’. ఇది 2019లో విడుదలై సూపర్‌ సక్సెస్‌ సాధించిన ‘మత్తు వదలరా’ సినిమాకు రెండో భాగం. ఈ నెల 13న సినిమా విడుదలవుతున్న...

శ్రీసింహ కోడూరి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మత్తు వదలరా 2’. ఇది 2019లో విడుదలై సూపర్‌ సక్సెస్‌ సాధించిన ‘మత్తు వదలరా’ సినిమాకు రెండో భాగం. ఈ నెల 13న సినిమా విడుదలవుతున్న సందర్భంగా శ్రీసింహ మీడియాతో మాట్లాడారు.

‘‘మొదటి భాగంతో పోల్చితే ఇందులో చాలా మార్పులు జరిగాయి. రెండో భాగం ఒక డిఫరెంట్‌ థ్రిల్లర్‌గా ఎన్నో ట్విస్ట్‌లు, సర్‌ప్రైజ్‌లతో అలరిస్తుంది. ఇందులో నేను, సత్య పోషించిన పాత్రలు డెలివరీ బాయ్స్‌ నుంచి స్పెషల్‌ ఏజెంట్స్‌గా మారే క్రమం ఆసక్తికరంగా ఉంటుంది. దర్శకుడు రితేష్‌ రాణాకు ఫిల్మ్‌ మేకింగ్‌లో చాలా అవగాహన ఉంది.


ప్రతీ విషయంలో క్లారిటీగా ఉంటారు. ఫరియా అబ్దుల్లా తనకు సరిపోయే పాత్రను ఇందులో పోషించారు. ఆమె ఓ పాట పాడటమే కాకుండా కొరియోగ్రఫీ కూడా అందించారు. ఈ సినిమా మొదటి భాగం కంటే డబుల్‌ థ్రిల్‌ను పంచుతుంది. ఈ మూవీ ఫ్రాంచైజీని కొనసాగించే ఆలోచనల్లో ఉన్నాం’’ అని చెప్పారు.

Updated Date - Sep 10 , 2024 | 03:34 AM