మళ్లీ కలసి నటిస్తారా?
ABN, Publish Date - Aug 06 , 2024 | 05:01 AM
ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న ‘స్పిరిట్’ చిత్రం స్ర్కిప్ట్ వర్క్ దాదాపు పూర్తయింది. ఈ ఏడాది చివరిలో షూటింగ్ మొదలయ్యే అవకాశాలు...
ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న ‘స్పిరిట్’ చిత్రం స్ర్కిప్ట్ వర్క్ దాదాపు పూర్తయింది. ఈ ఏడాది చివరిలో షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకొనే ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరా అనే చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. తాజాగా త్రిష పేరు వినిపిస్తోంది. ఆమెతో దర్శకుడు సందీప్ మాట్లాడారనీ, ఆమె కూడా ఓకే చెప్పారనీ సమాచారం. ప్రభాస్, త్రిష కాంబినేషన్‌లో ‘వర్షం’, ‘పౌర్ణమి’, ‘బుజ్జిగాడు’ చిత్రాలు వచ్చాయి. 16 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ జంట ‘స్పిరిట్’ లో కలసి నటించనున్నారన్నమాట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’ చిత్రంలో త్రిష నటిస్తున్నారు.