ఆ ట్యాగ్స్‌ మాకే ఎందుకు

ABN, Publish Date - Nov 27 , 2024 | 06:21 AM

ఇటీవలే ‘హనీ బన్నీ’ వెబ్‌ సిరీ్‌సతో ప్రేక్షకులను పలకరించారు సమంత. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘విడాకులు తీసుకున్న తర్వాత సమాజం కొన్ని ట్యాగ్స్‌ తగిలిస్తుంది...

ఇటీవలే ‘హనీ బన్నీ’ వెబ్‌ సిరీ్‌సతో ప్రేక్షకులను పలకరించారు సమంత. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘విడాకులు తీసుకున్న తర్వాత సమాజం కొన్ని ట్యాగ్స్‌ తగిలిస్తుంది. ‘సెకండ్‌ హ్యాండ్‌.. యూజ్డ్‌’ ఇలాంటి ట్యాగ్స్‌ ఎందుకు తగిలిస్తారో అర్థం కాదు. ఆ అమ్మాయిని.. తన కుటుంబాన్ని ఇవి ఎంతో బాధిస్తాయి. కష్టాల్లో ఉన్న ఆ అమ్మాయిని అవి ఎంతో కుంగదీస్తాయి. నా గురించి ఎన్నో అసత్య ప్రచారాలు చేశారు. అవన్నీ అబద్దాలు కాబట్టి నేను వాటిపై మాట్లాడదల్చుకోలేదు. కష్ట సమయంలో నా స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎంతోమంది నాకు మద్దతుగా నిలిచారు’’ అని చెప్పారు.

Updated Date - Nov 27 , 2024 | 06:21 AM