సెలబ్రిటీ నీకన్న ఎవడురా

ABN, Publish Date - Aug 20 , 2024 | 02:29 AM

సుడిగాలి సుధీర్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గోట్‌’(గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్స్‌). దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని చంద్రశేఖర్‌ రెడ్డి మొగుళ్ల నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ స్టేజ్‌లో ఉన్న...

సుడిగాలి సుధీర్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గోట్‌’(గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్స్‌). దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని చంద్రశేఖర్‌ రెడ్డి మొగుళ్ల నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ స్టేజ్‌లో ఉన్న ఈ చిత్రం నుంచి హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ‘బాసే హే నీలా ఉండే లక్కు మాకే లేదురా.. సెలబ్రిటీ నీకన్న ఎవడురా’ అంటూ కాసర్ల శ్యామ్‌ రాసిన పాట ఇది. ‘పుష్ఫ 2’లో టైటిల్‌ సాంగ్‌ పాడిన దీపక్‌ బ్లూ ఈ పాట పాడడం విశేషం. ‘ఇప్పటివరకూ ఎనభై శాతం చిత్రం పూర్తయింది. యాక్షన్‌ ఎపిసోడ్స్‌, రెండు పాటలు మిగిలి ఉన్నాయి. వాటిని కూడా త్వరలో చిత్రీకరిస్తాం’ అని నిర్మాత చెప్పారు.

Updated Date - Aug 20 , 2024 | 02:29 AM