ఆ పంజాబీ అమ్మాయి ఎవరు?

ABN, Publish Date - Oct 10 , 2024 | 05:47 AM

నటి పూనమ్‌కౌర్‌, బుధవారం ఎక్స్‌ వేదికగా ఓ సంచలన ట్వీట్‌ చేశారు. ‘‘చిత్రపరిశ్రమలోని ఓ దర్శకుడు ఓ పంజాబీ నటిని గర్భవతిని చేశాడు. అబార్షన్‌ చేయించి ఆ అమ్మాయి కెరీర్‌ను సర్వనాశనం చేశాడు...

నటి పూనమ్‌కౌర్‌, బుధవారం ఎక్స్‌ వేదికగా ఓ సంచలన ట్వీట్‌ చేశారు. ‘‘చిత్రపరిశ్రమలోని ఓ దర్శకుడు ఓ పంజాబీ నటిని గర్భవతిని చేశాడు. అబార్షన్‌ చేయించి ఆ అమ్మాయి కెరీర్‌ను సర్వనాశనం చేశాడు. అయితే ఆ వ్యక్తి.. రాజకీయనాయకుడిగా మారిన నటుడు కాదు. ఓ దర్శకుడు. ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) తోడ్పాటుతో ఆ పంజాబీ అమ్మాయికి కాస్త సహాయం లభించింది. ఈ విషయంలోకి నన్ను, రాజకీయనాయకుడిగా మారిన ఓ నటుడ్ని అనవసరంగా లాగారు’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. దాగుడు మూతలు ఆపి ఆ పంజాబీ అమ్మాయి పేరు బయట పెట్టాలంటూ నెటిజన్లు పూనమ్‌కౌర్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. గతంలో దర్శకుడు త్రివిక్రమ్‌పై తను మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశానని, కానీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇటీవలే పూనమ్‌ వెల్లడించారు.

Updated Date - Oct 10 , 2024 | 05:47 AM